నార్పల : మండల కేంద్రంలోని చైతన్యకాలనీలో గురువారం ఓ సైకో వీరాంగం సృష్టించాడు. స్థానిక పాత రామస్వామి వీధికి చెందిన చాకలి అంజి చైతన్యకాలనీలో ఆటోలు, బైక్‌లపై రాళ్లురువ్వుతూ హల్‌చల్ చేశాడు. ఆటోలకు అద్దాలు పగులగొట్టడంతో పాటు వీధి వెంబడి రాళ్లు విసురుతూ ప్రజల్ని హడలెత్తించాడు. సైకో చేష్టలకు స్థానికులు విసిగెత్తిపోతున్నారు.