బాణాలతో సైకో హల్చల్...
తూర్పుగోదావరి: జనాల మీదకు బాణాలను ఎక్కుపెడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఓ సైకో... తూర్పుగోదావరి జిల్లాలో హల్చల్ చేస్తున్నాడు. సైకో దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఈ సంఘటన చింతూరు మండలం వేగితోట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముత్తయ్య(30) గత కొంతకాలంగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా గ్రామంలో చలిమంట కాసుకుంటున్న దారయ్య, లాలమ్మ అనే ఇద్దరిపై ముత్తయ్య బాణాలు వేశాడు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.