
వీఆర్వోకు చెక్కు అందిస్తున్న అనిల్
ముస్తాబాద్(సిరిసిల్ల): నిజామాబాద్ ఎంపీ కవిత రైతుబంధు పథకం ద్వారా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వానికే అప్పగించారు. తెర్లుమద్దిలో ఎంపీ కవిత పేరిట 9.14 ఎకరాలు ఉంది. రైతుబంధు ద్వారా ఆమె కుటుంబానికి చెక్కు, పట్టాదారుపాసు పుస్తకాన్ని వీఆర్వో హరికిశోర్ అందించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంపీ కవిత భర్త అనిల్ తెర్లుమద్దిలో వచ్చిన రూ.37,400 విలువైన చెక్కును టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్‌రావు ద్వారా వీఆర్వో హరికిశోర్‌కు సోమవారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment