కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | Karimnagar district road accident | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Apr 26 2014 4:20 AM | Updated on Mar 29 2019 9:24 PM

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం - Sakshi

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయ భర్త మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భర్తకు తీవ్రగాయాలు
ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం


 సిరిసిల్ల,  కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయ భర్త మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుగ్రామాల్లో సందర్శించి రాత్రి హైదరాబాద్ తిరిగి వెళుతుండగా మోహన్‌రెడ్డి కారును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో  కారు నుజ్జు నుజ్జయింది.

తీవ్రంగా గాయపడ్డ మోహన్‌రెడ్డిని 108లో కరీంనగర్‌కు తరలించారు. కొట్టాల మోహన్‌రెడ్డి మాజీమావోయిస్టు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన సతీమణికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో సిరిసిల్లలో ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement