రోడ్ల మరమ్మతు చేపట్టాలి | Perform road repairs | Sakshi
Sakshi News home page

రోడ్ల మరమ్మతు చేపట్టాలి

Published Thu, Aug 4 2016 10:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వినతిపత్రం అందజేస్తున్ననాయకులు - Sakshi

వినతిపత్రం అందజేస్తున్ననాయకులు

  • బీజేపీ స్వచ్ఛ భారత్‌ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్‌
  • మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన
  • నిర్మల్‌అర్బన్‌ : పట్టణంలో రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ స్వచ్ఛ భారత్‌ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్‌ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రావుల రాంనాథ్‌ మాట్లాడుతూ పట్టణంలోని నగేశ్వర్‌రావు, మార్కెట్, గాంధీచౌక్, చింతకుంటవాడ, నాయుడివాడ, రాంరాగ్‌బావ్, బేస్తావార్‌పేట్, బంగల్‌పేట్, సోమవార్‌పేట్‌ తదితర కాలనీల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయని అన్నారు.
     
    ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ నగర్‌లోని ఇళ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయుడి మురళీధర్, జిల్లా నాయకులు రచ్చ మల్లేష్, పంతికె ప్రకాష్, ప్రేమ్, హరివర్మ, బీజేవైఎం జిల్లా నాయకుడు కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement