సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: కరెంటు అడిగితే కాల్చివేసిన పార్టీలకు అధికారం అప్పగిస్తే తెలంగాణకు మళ్లీ చీకటి రోజులే దిక్కవుతాయని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం సముద్రలింగాపూర్, దమ్మన్నపేట గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పార్టీలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకే ఒక్కటయ్యా యని పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనుకున్నందుకు కేసీఆర్‌ను ఓడించాలా? అని ఆయన ప్రశ్నించారు. మాయ కూటమికి ఓటేస్తే మన వేలితో మన కన్నునే పొడుచుకున్నట్లవుతుందని చెప్పారు.
సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యానని, సీఎం ఆశీర్వాదంతో మంత్రినయ్యానని మళ్లీ గెలిపిస్తే ఇం తకు నాలుగింతలు అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ‘ఇవి నా ఎమ్మెల్యే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ తలరాతను మార్చుకునే ఎన్నికలు.. ఆలోచనతో ఓటెయ్యండి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎవరైనా చనిపోతే దహన సం స్కారాల కోసం ఒక అరగంట పాటు కరెంటు ఇవ్వాలని ప్రాథేయపడేవారని, ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే ఇప్పుడున్న పింఛన్లు పెంచడంతోపాటు మరోసారి రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. పేదలకు మేలు చేస్తున్న కేసీఆర్‌ను మనమందరం కాపాడుకోవాలన్నారు.
దీనికంతటికీ కారణం కాంగ్రెసోళ్లే..
నేతన్నలకు ఉపాధితోపాటు మహిళలకు పండగ చీర లు అందే రెండు ఉపయోగాలున్న బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్నది కాంగ్రెస్సే అని కేటీఆర్ విమ ర్శించారు. ‘గతంలోనే చేపట్టిన రైతుబంధు చెక్కులు పంపకుండా కాంగ్రెస్ అడ్డుపడింది.. ఇప్పుడు నేరుగా పెట్టుబడి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చింది.. బ్యాంకర్లు ఆ సొమ్మును లోన్ కింద కట్ చేసుకుంటున్నరు. దీనికంతటికీ కారణం కాంగ్రెస్, టీడీపీలే.. మంచి చేసే ఆలోచన లేని ఆ పార్టీలకు బుద్ధి చెప్పండి’ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment