
సిరిసిల్ల : తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను మరో మహిళ చితకబాదింది. ఈ సంఘటన సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగిలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దరావతు రాజుకు అదే ప్రాంతానికి చెందిన పుర్భన్ వివాహమైంది.
అయితే కొంతకాలం కిందట కలికోట గ్రామానికి చెందిన మరో మహిళతో రాజుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయవ్వపై పుర్బన్ ఆమె కుమారుడు దాడికి దిగారు. కిందపడేశి కొట్టి, నడిరోడ్డుపై మెడకు తాడుతో ఉరి వేసే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ కలికోటకు చెందిన సాయవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.