నాలుగు దశాబ్దాల సిరిసిల్ల వస్త్రో త్పత్తి చరిత్రలో కార్మికులు కంటినిండా కు నుకుతీస్తున్నారు. సంక్షోభ సమయంలో..
నేతకార్మికులకు విశ్రాంతి
Published Mon, Sep 9 2013 4:01 AM | Last Updated on Sat, Aug 11 2018 7:29 PM
సిరిసిల్ల, న్యూస్‌లైన్ :నాలుగు దశాబ్దాల సిరిసిల్ల వస్త్రో త్పత్తి చరిత్రలో కార్మికులు కంటినిండా కు నుకుతీస్తున్నారు. సంక్షోభ సమయంలో.. సమ్మె కాలంలో ఆగని సాంచాలు ఇప్పుడు 8 గంటల పనివిధానంతో ఆగుతున్నాయి. దీంతో సిరిసిల్ల రాత్రివేళల్లో నిద్రపోతోంది. కార్మికవాడల్లో నిశ్శబ్దం అలుముకుంటోం ది. సంక్షోభ సిరిసిల్లలో నూతన విధానానికి అధికారులు బాటలు వేస్తున్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
రెండో షోలాపూర్‌గా, ఆంధ్రా భీవండిగా పేరున్న సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో రేయిం బవళ్లూ శ్రమించడం ఆనవాయితీగా వ స్తోంది. యంత్రంలాగే కార్మికుడూ సాంచా ల మధ్య నిలబడి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పొట్ట గడిచే పరిస్థితి నెలకొంది. 12 గంటల పనిని 8 గంటలకు కుదించి రెండు షిఫ్టుల్లో పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇటీవల జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ కొత్త విధానంతో కార్మికులకు విశ్రాంతి లభించి కుటుంబంతో కలిసి జీవించే పరిస్థితి ఏర్పడింది. కంటినిండా నిద్రపోతే కార్మికులకు మానసిక ప్రశాంతత లభించి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఎనిమి ది గంటలపాటు పనిచేసి సకాలంలో ఇం టికి చేరి భార్యాబిడ్డలతో కలిసి ఉండే అవకాశం చాలాకాలం తర్వాత సిరిసిల్లలో కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 34 వేల మరమగ్గాలతో విస్తరించి ఉన్న కార్మికక్షేత్రంలో పాతికవేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్త్రోత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.
కార్మికశాఖ కౌన్సెలింగ్
కార్మిక క్షేత్రాలైన బీవైనగర్, గణేశ్‌నగర్, తారకరామనగర్, సుందరయ్యనగర్, ప్రగతినగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో రాత్రిపూట సాంచాలను బంద్ పెడుతున్నారు. కొంతమంది కొత్త విధానా న్ని వ్యతిరేకిస్తూ కూలీ గిట్టుబాటు కావడం లేదని చెబుతుండగా, అలాంటి వారికి కార్మిక శా ఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా రు. 8 గంటల పనిలోనే 12 గంటలు పనిచేసినప్పుడు వచ్చే కూలి కార్మికులు పొం దేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. నిద్రలేమితో ఎదురయ్యే మా నసిక, శారీరక సమస్యల, వ్యసనాలకు లో నయ్యే పరిస్థితులను అధికారులు కార్మికులకు వివరిస్తూ 8 గంటల పనివైపు ప్రోత్సహిస్తున్నారు.
సిరిసిల్ల అసిస్టెంట్ లేబర్ అధికారి మహ్మద్ రఫీ కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లో ఇప్పటికీ 12 గంటల పని విధానం అమలు చేస్తుండగా, వారికి ముందు నోటీసులు ఇచ్చి తర్వాత కేసులు నమోదు చే సేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. చేనేత, జౌళిశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కొత్త విధానం దిశగా కార్మికులను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు ఉమ్మడిగా ప్రయత్నిండడంతో వ్యవస్థలో మార్పువస్తోంది. కొత్త విధానంపై కార్మికులు అవగాహన పెంచుకుంటే భవిష్యత్‌లో సిరిసిల్ల పట్టణంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Advertisement
Advertisement