
చిన్నబోనాలలో అగ్నిప్రమాదం
సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది.
చిన్నబోనాల(సిరిసిల్ల రూరల్), న్యూస్‌లైన్: సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది. ఫోన్ చేసిన గంటకు ఫైర్ అధికారులు రాగా, అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది. ఇరుకు రోడ్డు కావడంతో ఫైరింజిన్ ఇంటి దాకా చేరుకోలేకపోయింది. చిన్నబోనాలకు చెందిన గోస్కుల శంకరయ్య ఇంట్లో రాత్రి 9 గంటలకు విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది.
ఇంట్లో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్ అధికారులకు సమాచారమిచ్చేందుకు ఫోన్ చేయగా అది పనిచేయలేదు. దీంతో గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు 100 నంబర్‌కు ఫొన్ చేసి సమాచారమివ్వగా గంట ఆలస్యంగా ఫైరింజిన్ గ్రామానికి చేరుకుంది. అయితే ఇరుకురోడ్డు కావడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ఇంట్లో సామగ్రి, టీవీ, బియ్యం, ఫ్రిజ్ తదితర వస్తులు కాలిపోయాయి.
రూ.4 లక్షలకు పైగానే నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం రోదించింది. ఫైర్ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. నిరాశ్రయులైన కుటుంబానికి గ్రామస్తులు ఆశ్ర యం కల్పించారు. జరిగిన ఆస్థి నష్టం పై అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.