ఓ యువకుడు బలవన్మరణం చెందేందుకు గొంతుకోసుకున్నాడు.
కరీంనగర్: ఓ యువకుడు బలవన్మరణం చెందేందుకు గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆదివారం చోటుచేసుకుంది. సిరిసిల్లకు చెందిన ఆకలి రవి(26) బ్లేడుతో గొంతు కొసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న రవిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(సిరిసిల్ల)