జిల్లా ఏర్పాటుపై వెనుకడుగు తగదు | donot goback on sirisilla district | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటుపై వెనుకడుగు తగదు

Published Sat, Aug 6 2016 8:44 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

మాట్లాడుతున్న జక్కుల యాదగిరి - Sakshi

మాట్లాడుతున్న జక్కుల యాదగిరి

  • సిరిసిల్ల ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు
  • ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ హెచ్చరిక
  • సిరిసిల్ల టౌన్‌ : సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో ప్రభుత్వం వెనక్కి తగ్గవద్దని వైఎస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి డిమాండ్‌ చేశారు. శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు కలెక్టర్‌ నివేదించారని, ఇప్పుడు జాబితా నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు. ముందుగా హడావుడి చేసి ఇప్పుడు కాదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంస్పష్టమైన ప్రకటన ఇవ్వని పక్షంలో అన్ని పార్టీలతో కలిసి పోరాటాలు చేపడ్తామన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చొక్కాల రాము, నాయకులు కొంపల్లి విష్ణు, గుండేటి శేఖర్, వంగరి అనిల్, బూర నాగరాజు, కొత్వాల్‌ అనీల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement