
సిరిసిల్ల: బీజేపీలో టిక్కెట్ల పోరు మొదలైంది. సిరిసిల్ల బీజేపీ టికెట్ కోసం ఆరుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం వినూత్నంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆశావహుల మధ్య ఎన్నికలు నిర్వహించింది.
టికెట్ ఆశిస్తున్న వారిలో తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన సరిదెన రాహుల్‌రావు, ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంతుగౌడ్ (ముస్తాబాద్), రెడ్డబోయిన గోపి (సిరిసిల్ల), జయశ్రీ (కరీంనగర్), సుజాతారెడ్డి (కరీంనగర్) ఉన్నారు. ఈ ఆరుగురి మధ్య పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఓటింగ్‌కు ముందే టిక్కెట్ ఆశిస్తున్నవారు పార్టీ మండల అధ్యక్షులతో క్యాంపులు నిర్వహించడం గమనార్హం.
రాష్ట్ర నేతల సమక్షంలో ఎన్నికలు
బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, మురళీధర్‌రావు, యెన్నం లక్ష్మీనారాయణ ఉన్నారు. హైదరాబాద్‌లో ముఖ్య నేతల సమక్షంలో ఎన్నికలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా టికెట్‌ను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనా ముఖ్య నాయకుల సమక్షంలో సిరిసిల్ల సీటు కోసం బీజేపీ నేతల మధ్య అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment