
సాక్షి, తిరుపతి: ఏపీలో ఇసుక తవ్వకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇసుక తవ్వకాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
గతంలో చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. టీడీపీ సర్కార్ హయంలో ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయంలో పారదర్శక విధానంలో ఇసుక అమ్మాకాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment