
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నేతలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అసలు ఇసుకాసురులు టీడీపీ నాయకులే అని విమర్శలు చేశారు.
కాగా, మంత్రి అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక సరఫరా చేయడంతో రూ.4వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అసలు ఇసుకాసురులు టీడీపీ నాయకులే. టీడీపీ హయాంలో ఇసుక ఎంత దోపిడీకి గురైందో ప్రజలకు తెలుసు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టింది టీడీపీ నాయకులు కాదా?. ఇసుక అక్రమాలకు టీడీపీ పాల్పడింది కాబట్టే 2019లో వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ఆ మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు చంద్రబాబూ: మంత్రి మేరుగు