రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల కారణంగా నెలకొన్న తాత్కాలిక ఇసుక కొరత సమస్యను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీతో ఉన్న అవగాహన మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్ అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఇసుక సమస్యే ఉండదని ప్రభుత్వం చెప్తోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలకు పాల్పడ్డం దారుణమని సర్కార్ ఆక్షేపిస్తోంది.