
వికారాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గోపాల్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న యాలాలలో ఇసుక మాఫియా సమాచారాన్ని గోపాల్ అనే వ్యక్తి పోలీసులకు చేరవేశారు. దీంతో ఇసుక దందా చేస్తున్న కాంట్రాక్టర్లు గోపాల్‌ను బెదిరించి హత్యాప్రయత్నం కూడా చేశారు.
ఇసుక దందా చేసే వారికి స్థానిక ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డే సమాచారం అందించాడని గోపాల్ ఆరోపిస్తున్నాడు. దీంతో అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గోపాల్‌ను సముదాయించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమింప చేశారు. వెంటనే ఇసుక మాఫియాకు సహకరిస్తోన్న పోలీసులపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment