Yalala
-
కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?
సాక్షి, వికారాబాద్(యాలాల): బైకును వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పాతకక్షల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే బైకును కారుతో ఢీకొట్టి హత్య చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన తాండూరు పట్టణంలో యాలాల ఠాణా పరిధిలోకి వచ్చే రాజీవ్ కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. రాజీవ్ కాలనీకి చెందిన జబ్బార్(35)ఆటో డ్రైవర్. శనివారం రాత్రి 11 గంటలకు అతడు అదే కాలనీకి చెందిన సూఫియాన్, సోహైల్‌తో కలిసి బైక్‌పై తాండూరు నుంచి కాలనీ వైపు వస్తున్నాడు. చదండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా.. ఈక్రమంలో కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో జబ్బార్ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూఫియాన్, సొహైల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సూఫియాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. చదవండి: ఒడిశా: రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం! ఈ ఘటనను మొదట స్థానికులు ప్రమాదంగా భావించారు. కారు ఢీకొన్న తర్వాత అందులోని వ్యక్తులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సూఫియాన్.. పాతకక్షల నేపథ్యంలో ఇస్మాయిల్, మోహిన్ అనే వ్యక్తులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. అనంతరం యాలాల పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌సీఐ జలంధర్‌రెడ్డి వివరాలు సేకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడు జబ్బార్‌కు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తల్లి ప్రాణం విలవిల; కళ్లెదుటే కొడుకు మృతి
సాక్షి, యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీటమునుగుతుంటే తల్లిమనసు తల్లడిల్లింది. నిస్సహాయస్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్(11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాతతాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టింది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం! చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కోసం అక్రమార్కులు ఇష్టారాజ్యం గా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహాన్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: హైదరాబాద్‌లో సంచలనం రేపిన కిరాతక హత్య ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం -
తల్లి నిస్సహాయత.. కుమారుడి మృత్యువాత
యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీట మునుగుతుంటే తల్లి మనసు తల్లడిల్లింది. నిస్సహాయ స్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్ (11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాత తాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టిం ది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం! చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కో సం అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహా న్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సాక్షి, యాలాల / వికారాబాద్ : శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు. అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఆటోలో ఎక్కారు. ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్, యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వాహనంలో చిక్కుకున్న బాలిక శివకళ... ఇన్సెట్లో అనంతయ్య (ఫైల్) ,తుల్జమ్మ మృతదేహం -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గోపాల్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న యాలాలలో ఇసుక మాఫియా సమాచారాన్ని గోపాల్ అనే వ్యక్తి పోలీసులకు చేరవేశారు. దీంతో ఇసుక దందా చేస్తున్న కాంట్రాక్టర్లు గోపాల్‌ను బెదిరించి హత్యాప్రయత్నం కూడా చేశారు. ఇసుక దందా చేసే వారికి స్థానిక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డే సమాచారం అందించాడని గోపాల్ ఆరోపిస్తున్నాడు. దీంతో అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గోపాల్‌ను సముదాయించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమింప చేశారు. వెంటనే ఇసుక మాఫియాకు సహకరిస్తోన్న పోలీసులపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. -
నిఖా అక్కడ.. నిరీక్షణ ఇక్కడ!
యాలాల/బొంరాస్‌పేట: ఆ ఊళ్లో పెళ్లికూతురు.. ఈ ఊళ్లో పెళ్లికొడుకు.. మధ్యలో ఉప్పొంగుతున్న నది.. మరికొద్ది సేపట్లో పెళ్లికూతురి ఊళ్లో నిఖా (పెళ్లి) జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఇరువర్గాల పెద్దలు. మరో గంటలో పెళ్లి కూతురి ఇంటికి చేరుకునేలోపు, మార్గమధ్యంలో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. పెళ్లి కొడుకుతోపాటు, ఆయన కుటుంబీకులంతా నది ఒడ్డునే నిలిచిపోయారు. దీంతో ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లిని.. సాయంత్రం 5.30 గంటలకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్‌కు చెందిన మహబూబ్ అలీ, షబానాబేగం దంపతుల కూతురు పర్వీన్‌కు.. మహబూబ్‌నగర్ జిల్లా చిలమల మైలారానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్‌తో ఆదివారం ఉదయం 10 గంటలకు ‘నిఖా’ ఖాయం చేశారు. పెళ్లికూతురు తరఫు వారు భోజనాలు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకుతోపాటు కుటుంబసభ్యులంతా ఉదయం 7 గంటలకు స్వగ్రా మం నుంచి బయలుదేరగా.. మార్గమధ్యంలోని కోకట్ కాగ్నా నది ఉప్పొంగింది. మరో మార్గం లేకఅక్కడే వారు ఆగిపోయారు. ఇలా 8 గంటల పాటు నదివద్దే నిరీక్షించారు. చివరకు సాయంత్రం కాగ్నా నది ఉధృతి తగ్గడంతో వాహనాల్లోనే పెళ్లికూతురి ఇంటికి వెళ్లారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లి.. సాయంత్రం 5.30 గంటల కు జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘ఉపాధి’లో అన్నీ అవకతవకలే..
సామాజిక తనిఖీలో నిగ్గుతేల్చిన అధికారులు యాలాల: ఉపాధి హామీ పథకంలో అన్నీ అవకతవకలే చోటుచేసుకున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో 8వ సామాజిక తనిఖీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి, డీవీఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలకు 2014-15 సంవత్సరంలో 8 నెలల పనికిగాను రూ.96 లక్షల పనులు జరిగాయి. ఇందులో అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీల డబ్బుల విషయమై అవకతవకలు జరిగాయి. వననర్సరీలో మొక్కల పెంపకంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మొక్కలు వృథాగా పోయా యి. ముందుగా జుంటుపల్లి గ్రామం సామాజిక తనిఖీ జరిగింది. జుంటుపల్లి గ్రామంలో రూ.6 లక్షలకుపైగా పనులు చెస్తే ఫీల్డ్ అసిస్టెంట్ రూ.లక్షకుపైగా పనుల రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వలేదని తేలింది. గ్రామంలో 19 గ్రూపులకు పనికల్పించ లేదని ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూలీలు ఫిర్యాదు చేశారు. పనులు చేసినా టెక్నికల్ అసిస్టెంట్ ఉదయ్‌కుమార్ మూడు నెలల తర్వాత మేజర్మెంట్ చేయడంతో కూలీలు డబ్బులు నష్టపోయారని చెప్పారు. బానాపూర్‌లో 13 గ్రూపులకు పనికల్పించడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చే శారు. పగిడ్యాల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సాయిరెడ్డి, రూ.54 వేల పనుల రికార్డులు తనిఖీ బృందానికి రికార్డు ఇవ్వలేదని సామాజిక తనిఖీలో తేలింది. తగిన పని కన్నా ఎక్కువ ల్యాండ్ లెవలింగ్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జాబ్‌కార్డులు ఎంట్రీ చేయడం లేదని చెప్పారు. నాగసమందర్ గ్రామంలో పనులకు ఫీల్డ్ అసిస్టెంట్ దరఖాస్తులు తీసుకోవడం లేదని గ్రామస్తులు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. గ్రామసభల తిర్మానాలు సామజిక బృందానికి ఇవ్వలేదు. అన్నాసాగర్‌లో ఏడుగురు రైతులు గుంతలు తవ్వినా.. మొక్కలు నాటకుండా రూ.19 వేలు డబ్బులు డ్రా చేశారని తేలింది. కొకట్ గ్రామంలో పనులకు సంబంధించిన తీర్మానాలు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. 95 రోజులు పనిచేసిన 25 మంది కూలీకు డబ్బులు ఇవ్వలేదని తేలింది. ముద్దాయిపేట్, రాఘవపూర్, తిమ్మాయిపల్లి, రాస్నం, దేవనూర్, హాజిపూర్, బెన్నూర్‌తోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో అన్నీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సౌజన్య, ఎంపీపీ సాయన్నగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
బషీరాబాద్/యాలాల: తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దాదా పు ఏడాది తర్వాత విషయం వెలుగుచూసింది. వివాహిత భర్తే దారుణా నికి ఒడిగట్టాడు. శుక్రవారం పోలీసు లు వివాహిత మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించా రు. పోలీసుల కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రా మానికి చెందిన అమృత(20)ను ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు అనీసా(16 నెలలు) ఉంది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక అమృత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో కక్షగట్టిన అబ్దుల్లా దాదాపు ఏడాది క్రితం భార్యకు మాయమాటలు చెప్పి బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యను రాయితో మోది హత్య చేశాడు. అనంతరం నీళ్లపల్లి-పర్వత్‌పల్లి మార్గంలో ఓ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం అబ్దుల్లా కూతురిని కూడా స్వగ్రామంలో చంపేసి పూడ్చివేశాడు. కొద్దికాలానికి ముంబై వెళ్లిపోయాడు. ఇటీవల ఒంటరిగా అబ్దుల్లా గ్రామానికి వచ్చాడు. కూతురు, మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమృత తల్లిదండ్రులు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు తాండూరు రూరల్ సీఐ శివశంకర్ అనుమానంతో ఇటీవల అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు అబ్దుల్లా. అతడు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం రూరల్ సీఐతో పాటు బషీరాబాద్, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు జరుపగా అమృత అస్థిపంజరం లభ్యమైంది. పోలీసు లు అక్కడే వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. చిన్నారి మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తుండొచ్చని సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
‘బంగారు తల్లి’కి ఏమైంది?
యాలాల: ‘బంగారు తల్లి’ పథకానికి 2013 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,637 దరఖాస్తులు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. మొదటి పర్యాయంలో భాగంగా ఇచ్చే నగదు ప్రోత్సాహకానికి వీటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ.65,92,500 చెల్లించాల్సి ఉంది. ఘట్కేసర్, షాబాద్, గండీడ్, కుల్కచర్ల, మహేశ్వరం మండలాల్లో మొదటి దశ చెల్లింపుల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదీ పథకం.. ఈ పథకంలో భాగంగా ఆడ శిశువు జనన నమోదు సమయంలో రూ.2,500 అందజేస్తారు. ఆమెకు 21 సంవత్సరాలు నిండేవరకు (డిగ్రీ పూర్తిచేసే వరకు) రూ.లక్ష 55వేలను ప్రభుత్వం వివిధ దశల్లో అందజేస్తుంది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బాలికల కోసం ఈ పథకాన్ని 2013, మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టి చట్టబద్ధం చేశారు. ఆడ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పడే విధంగా రూపొందించిన ఈ పథకం సరిగ్గా అమలైతే అంతోఇంతో లబ్ధి చేకూరుతుంది. కానీ అధికారుల నిర్లిప్తత కారణంగా పథకం మూలనపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. నమోదులో జరుగుతున్న తీవ్ర జాప్యం, ప్రోత్సాహకానికి నిధుల మంజూరులో నిర్లక్ష్యం కారణంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఆరు నెలలుగా ప్రోత్సాహకం అందకపోవ డంపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్యాంకు ఖాతా, గ్రామ సంఘం, ఏఎన్ఎం, ఐకేపీ కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా.. డబ్బులు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. -
పత్తి రైతు బలవన్మరణం
యాలాల, న్యూస్‌లైన్: ఆరుగాలం కుటుంబమంతా కలిసి చెమటోడ్చి నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుప్పలవుతున్నాయి. వాటి ని తీర్చే మార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కిష్టప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నట్టల చిన్న నర్సప్ప(35)కు స్థానికంగా పదెకరాల పొలం ఉంది. ఆయన నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేసి మిగతాది బీడుగా ఉంచాడు. పెట్టుబడి కోసం నర్సప్ప తెలిసిన వారి వద్ద రూ.85 వేలు అప్పు చేశాడు. జంటుపల్లిలోని ఆంధ్రా బ్యాంకులో రూ.70 వేలు తీసుకున్నాడు. ఆరుగాలం అంతా కుటుంబంతో కలిసి కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. వరుస తుపానులు పంటను దెబ్బతీశాయి. దీంతో మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అది కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. రోజురోజుకు అప్పునకు వడ్డీలు పెరుగుతున్నాయి. రుణం తీర్చే మార్గం కానరావడం లేదని నర్సప్ప ఇటీవల భార్య పద్మమ్మతో వాపోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో పొలానికి వెళ్తున్నానని శుక్రవారం ఉదయం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఉదయం 11గంటల సమయంలో స్థానికులు చూడగా నర్సప్ప తన పొలంలో ఓ చెట్టుకు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రా ణం పోవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలి పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య పద్మమ్మతో పాటు కొడుకు భానుప్రసాద్, కూతురు భారతి ఉన్నారు. నర్సప్ప మృతితో కుటుంబీ కులు గుండెలుబాదుకుంటూ రోదించారు. నర్సప్ప ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధినపడిందని గ్రామస్తులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సప్ప మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభాల కోసం వెళ్లి...కానరాని లోకాలకు
యాలాల, న్యూస్‌లైన్: విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు రైతులు గాయపడ్డారు. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు విద్యుత్ స్తంభాల కోసం నాలుగు ట్రాక్టర్లలో బషీరాబాద్ మండలం నవల్గా సబ్‌స్టేషన్‌కు ఆదివారం ఉదయం వెళ్లారు. సబ్‌స్టేషన్ నుంచి 9 విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లలో వేసుకొని సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా నాలుగు ట్రాక్టర్లలో రెండేసి స్తంభాలు ఉండగా కావలి బుగ్గప్ప(45), అప్పరిగిరి ఆశన్న(50), మడిగె ఎల్లప్ప, రమేష్‌లు ఉన్న ట్రాక్టర్లో మూడు స్తంభాలు వేసుకున్నారు. మార్గంమధ్యలో ఎన్కెపల్లి గేటు సమీపంలోని దర్గా వద్ద వాహనం డ్రైవర్ అశోక్ ట్రాక్టర్‌ను అదుపు చేయకపోవడంతో ట్రాలీ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురు రైతులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదంలో బుగ్గప్ప తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆశన్న, ఎల్లప్పకు తీవ్ర గాయాలవగా రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆశన్న పరిస్థితి విషమంగా ఉండటం తో ఇక్కడి వైద్యులు నగరానికి రిఫర్ చేశారు. కుటుంబసభ్యులు తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం 6 గంటల సమయంలో ఆశన్న మృతిచెందాడు. ఎల్లప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో నగరానికి తరలించారు. బుగ్గప్పకు భార్య దేవమ్మతో పాటు కొడుకులు అశోక్, రవి, అనిల్, కూతుళ్లు మంజుల, వసుంధర ఉన్నారు. ఆశన్నకు భార్యలు పద్మమ్మ, ఆశమ్మలతో పాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉంది. విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చేందుకు వెళ్లిన రైతులు ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బుగ్గప్ప, ఆశన్నల మృతితో కుటుంబీకులు గుండెలుబాదుకుంటూ రోదిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
యాలాల, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని అగ్గనూరు వీఆర్వో మునియప్ప దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని రసూల్పూర్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండ లం మంతన్‌గౌడ్ గ్రామానికి చెందిన మునియప్ప(45) మండల పరిధిలోని అగ్గనూరు గ్రామ క్లస్టర్ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తోటి ఉద్యోగులతో కలిసి తాండూరుకు వచ్చా రు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆయన తన బైకుపై స్వగ్రామానికి వెళ్తుండగా రసూల్పూర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో యాలాల నుంచి తాండూరుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం గమనించి కుటుంబీకులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులు, యాలాల రెవెన్యూ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య అంబమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శనివారం సస్పెన్షన్ వేటు.. బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ గ్రామ వీఆర్ఏ(కావలికారు)గా విధులు నిర్వహిస్తున్న మునియప్ప రెండేళ్ల క్రితం పదోన్నతిపై అగ్గనూరు వీఆర్వో బాధ్యతలు స్వీకరించారు. మునియప్ప అందరితో కలివిడిగా ఉండేవారని బంధువులు, గ్రామస్తులు, నాయకులు తెలిపారు. కాగా శనివారం ఇసుక మేటలను పరిశీలించడానికి వచ్చిన వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియలో వెనుకబడ్డారనే కారణంతో మునియప్పతో పాటు మరో వీఆర్వో వెంకటయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయమై ఆదివారం ఉదయం నుంచి తన తోటి ఉద్యోగులు, మిత్రుల వద్ద చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఉండొచ్చని తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు. -
అమ్మను చంపేసింది..
యాలాల, న్యూస్‌లైన్: నవమాసాలు మోసి కనిపెంచింది.. తాను పస్తులున్నా కూతురికి కడుపునిండా అన్నం పెట్టింది. రెక్కలుముక్కలు చేసుకొని ఆ మూతృమూర్తి కుమార్తెను పెంచి పెద్ద చేసింది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు సపర్యలు చేసి కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురు కొట్టి చంపేసింది. అనంతరం భర్తతో కలిసి మృతదేహాన్ని కాగ్నా నదిలో పడేసింది. నెలరోజులుగా ఆ తల్లి కనిపించకపోవడంతో గ్రామస్తులు, బంధువులు గట్టిగా నిలదీయడంతో కుమార్తె అసలు విషయం చెప్పింది. హృదయాలను ద్రవింపజేసే ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి అంతమ్మ(65)కు కూతురు కిష్టమ్మ ఏకైక సంతానం. వృద్ధురాలికి గ్రామ శివారులో రెండు ఎకరాల పొలం ఉంది. 30 ఏళ్ల క్రితం మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఆశన్నను ఇల్లరికం తెచ్చుకొని కూతురు కిష్టమ్మతో వివాహం చేసింది. వీరికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కొన్నాళ్లుగా అంతమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వయసు మీదపడడంతో చేతులతో నేలపై పాకుతోంది. ఇంట్లోనే తింటూ కాలం వెళ్లదీస్తోంది. నెల రోజుల క్రితం ఓ రాత్రివేళ అంతమ్మ అన్నం పెట్టమని కూతురును వేడుకుంది. ‘నిత్యం నీకు సపర్యలు చేయలేక చస్తున్నా’ అంటూ ఈసడించుకున్న ఆమె తల్లి అంతమ్మ చెంపలపై కొట్టింది. దీంతో అంతమ్మ అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణం విడిచింది. విషయాన్ని గమనించిన కిష్టమ్మ, ఆశన్న దంపతులు అర్ధరాత్రి వేళ మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని కాగ్నా వాగులో పడేసి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే ఉంటున్నారు. వీధిలో తచ్చాడుతూ అందరినీ ఆప్యాయంగా పలుకరించే అంతమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన బంధువులు అంతమ్మ విషయమై ఆరా తీశారు. తాండూరు మండలంలోని బెల్కటూర్‌లో ఉండే బంధువు నాగమ్మ వద్ద ఉంటోందని కిష్టమ వారిని నమ్మించేయత్నం చేసింది. దీంతో అనుమానించిన బంధువులు, గ్రామస్తులు వెంటనే బెల్కటూరులో ఉండే నాగమ్మకు ఫోన్ చేశారు. అంతమ్మ తన వద్ద లేదని ఆమె చెప్పింది. శుక్రవారం గ్రామస్తులు కిష్టమ్మను గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిన ఆమె తల్లి ని చంపేసిన విషయం చల్లగా చెప్పింది. సర్పంచ్ విజయలక్ష్మి సమాచారంతో తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ నాగార్జున గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. కిష్టమ్మ, ఆశన్న దంపతులను విచారించగా నేరం అంగీకరించారు. అంతమ్మ మృతదేహం కోసం కాగ్నా వాగు పరిసరాల్లో సాయంత్రం వరకు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల క్రితం మండలంలో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా వాగు భారీగా ఉప్పొంగడంతో మృతదేహం కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్గనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కిష్టప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.