విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిగాయని అధికారులు నిర్థారించారు. ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్ నింబంధనల ఉల్లంగనేనని, ఇసుక తవ్వకాలను తాము ఎవరికీ ఏలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు.