పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేబ్రోలు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు పరామర్శించారు. చేబ్రోలు రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షలు నష్టపరిహరాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.