హైదరాబాద్: తమ్ముడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వివాహిత అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్‌కు చెందిన లావ్యణ్య(35) తన తమ్ముడు స్వామికి ఇతరుల వద్ద అప్పుచేసి రూ.26 లక్షలు ఇచ్చింది. అయితే ఆ డబ్బు స్వామి తిరిగి ఇవ్వక పోవడంతొ లావణ్య తీవ్ర ఒత్తిడికి గురైంది.
దీంతో ఈనెల 4న పుట్టింటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి భర్త ప్రపాద్ డ్యూటీ నుంచి ఇంటికి తాళంవేసి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఓ లేఖ లభించింది. తమ్ముడికి ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందుతున్నా.. అని రాసిఉంది. దీంతో భర్త ప్రసాద్ సోమవారం మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం
శ్రీనగర్‌కాలనీ: యువతి అదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.రమ్య(20) మధురానగర్ లక్కీ లేడీస్ హాస్టల్‌లో ఉంటుంది. ఈనెల 3న ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నానని సోదరుడు నవీన్‌కు ఫోన్ చేసింది. యువతి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పాటు హాస్టల్‌కు కూడా తిరిగి రాకపోవడంతో నవీన్ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్..
వ్యక్తిఅదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్రహ్మశంకర్‌నగర్‌కు చెందిన మహేశ్(38) గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మార్చి 28న మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్రహ్మణితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులతో పాటు పలు ప్రదేశాల్లో వెతికనా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు


