హరీష్ రావు పరిగి పర్యటన అప్‌డేట్స్..
హరీష్ రావు అరెస్ట్..
- పరిగి పర్యటనకు బయల్దేరిన హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు..
- హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు..
- అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు.
- ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతల తరలింపు.
- పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు.
బీఆర్‌ఎస్ నేతల ఆందోళన..
రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకుంటున్న పోలీసులు
పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం
హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు
👉అంతకుముందు.. మంగళవారం ఉదయం మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు. హరీష్‌ను పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
👉కాగా, ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు హరీష్ పరిగి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుభప్రద్ పటేల్‌ను ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు.

👉అయితే, పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి హరీష్‌రావు సంఘీభావం తెలపనున్నారు.
మాజీ మంత్రి @BRSHarish గారు హౌస్ అరెస్ట్.. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత.
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు.
హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, పలువురు ఉమ్మడి… pic.twitter.com/sMXVrP1nvU— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026


