కేటీఆర్‌, సిద్ధరామయ్యల ట్వీట్‌ వార్‌ | Tweet War Between KTR And Siddaramaiah Over Congress Promises, See Details Inside - Sakshi
Sakshi News home page

KTR Vs Siddaramaiah: కేటీఆర్‌, సిద్ధరామయ్యల ట్వీట్‌ వార్‌..వాటిపైనే మాటల యుద్ధం

Published Tue, Dec 19 2023 12:46 PM | Last Updated on Tue, Dec 19 2023 1:13 PM

Tweet War Between Ktr And Siddaramaiah On Congress Promises - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మధ్య మంగళవారం ఎక్స్‌(ట్విటర్‌)లో మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్‌ వార్‌ నడిచింది. 

‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం. అంత మాత్రానా అన్నీ ఫ్రీగా ఇస్తామా. అయినా మాకూ ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’ అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధారమయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాం‍డిల్‌లో పోస్ట్‌ అయిన వీడియోపై కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని, కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. అయినా ఎన్నికల హామీలిచ్చేటపుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అని ఎద్దేవా చేశారు. 

కేటీఆర్‌ ట్వీట్‌కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్‌ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా..కనీసం మీకు నిజమేంటో..నకిలీ, ఎడిటెడ్‌ ట్వీట్‌ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు.ఇలాంటి ఫేక్‌, ఎడిటెడ్‌ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంది. బీఆర్‌ఎస్‌ సర్క్యులేట్‌ చేస్తుంది’అని కేటీఆర్‌కు సిద్ధరామయ్య చురకంటించారు.

ఇదీచదవండి..బస్‌ భవన్‌ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement