సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు.
గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశా రు.
రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment