హామీలు నెరవేర్చే వరకు పోరాటం | The struggle to fulfill promises | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చే వరకు పోరాటం

Published Wed, Jan 28 2015 3:48 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

హామీలు నెరవేర్చే వరకు పోరాటం - Sakshi

హామీలు నెరవేర్చే వరకు పోరాటం

తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాక నిరంతర పోరాటం సాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

అనంతపురం అర్బన్ : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాక నిరంతర పోరాటం సాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టనున్న దీక్షకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి  ప్రారంభించిన పాదయూత్ర రెండవ రోజు మంగళవారం అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నందిని హోటల్ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా జలాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ మాట్లాడుతూ... టీడీపీ అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం మెడలు వంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా మధుసూదన్‌రెడ్డి పాదయాత్ర చేశారన్నారు. జిల్లా మహిళ అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. మహిళలంతా సంఘటితమై ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.

సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రె డ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. రైతులు, డ్వాక్రా మహిలు, చేనేత కార్మికులను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమన్నారు.

పార్టీ నేత చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. అనంత చెల్లమ్మ కన్నీళ్లు తుడవాలని అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ముఖ్యమంత్రి, మంత్రులు అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి మధుసూదన్‌రెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు మధుసూదన్‌రెడ్డికి నగర శివారులోని మెట్టగోవిందరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఉరవకొండ నుంచి మొదలైన పాదయూత్ర 70 కిలోమీటర్లు కొనసాగింది.

జల్లిపల్లి, లత్తవరం, షేక్షానుపల్లి, కోనాపురం, పెన్నోహోబిలం, శివకాలపేట, ఉదిరికొండ, ముద్దలాపురం, కూడేరు, అరవకూరు, కమ్మూరు, గొట్కూరు, బ్రహ్మణాపల్లి, రాచానపల్లి, సిండికేట్ నగర్ మీదుగా అనంతపురంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వైవి.నాగిరెడ్డి, రైతు సంఘం నేత తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రాయదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార ్యదర్శి మీసాల రంగన్న, పార్టీ అనుబంధ సంఘ రాష్ట్ర నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, ఎగ్గుల శ్రీనివాసులు, శ్రీదేవిరెడ్డి, అనుంబంధ సంఘాల అధ్యక్షులు మరవపల్లి ఆదినారాయణరెడ్డి, వెంకట  చౌదరి, ధనుంజయ యాదవ్, బండి పరుశురాం, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతకుంట మధు, డాక్టర్ మైనుద్దీన్, మిద్దె భాస్కర్‌రెడ్డి, మారుతినాయుడు, పెన్నోబిలేసు, రిలాక్స్ నాగరాజు, కృష్ణవేణి, విద్యాసాగర్‌రెడ్డి, అంకిరెడ్డి ప్రమీళరెడ్డి, హజీరాం బీ, మునీరా, నాగలక్ష్మి, కణేకల్ లింగారెడ్డి, నరసింహరెడ్డి, వలిపిరెడ్డి శివారెడ్డి, గౌస్‌బేగ్, సురేష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 
డిమాండ్లు ఇవే...
హంద్రీ-నీవాకు 2015-16 బడ్జెట్‌లో 1000 కోట్లు కేటాయించాలి.
వచ్చే ఖరీఫ్‌కి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరిందించాలి
రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు బేషరతు రుణమాఫీ చేయాలి
ఇంటికో ఉద్యోగం కల్పించాలి
నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు చెల్లించాలి
నిరుద్యోగ యువతకు తక్షణమే ఉపాధి కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement