
జనం ఉసురుతో బాబు పని సరి
క్రోసూరు: ‘రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తా.. పింఛన్ల మొత్తం వెరుు్య రూపాయలకు పెంచుతా.. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఊరూరా ప్రచారం....
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. క్రోసూరులో ఆదివారం నిర్వహించిన పెదకూరపాడు నియోజకవర్గ స్థారుు కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలసికట్టుగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.
క్రోసూరు:
‘రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తా.. పింఛన్ల మొత్తం వెరుు్య రూపాయలకు పెంచుతా.. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఊరూరా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందరినీ మోసం చేశారు.. రుణాలు మాఫీ చేయలేదు.. కొందరికే పింఛన్లు ఇస్తున్నారు.. ఇంటికో ఉద్యోగం ఊసే లేదు.. జనం ఉసురు తగిలి ఆయన కొట్టుకుపోవటం ఖాయం..’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థారుులో మండిపడ్డారు.
క్రోసూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, వారి పక్షాన పోరాటాలు చేసి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరెవేర్చేలా చూస్తామని చెప్పారు. నాలుగు నెలల చంద్రబాబు పాలనతో విసిగిపోరుున జనం తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. సీఎం, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అధికార మత్తులో మునిగిపోయూరని, వారి మత్తు దిగేలా రైతులు, మహిళలతోకలిసి కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు.
నాలుగు నెలల పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, ెకేసులు పెరిగాయన్నారు. పోలీస్ వ్యవస్థను టీడీపీ తన జేబు సంస్థలా వాడుకుంటోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బెయిల్‌రాని కేసులు పెడుతూ.. దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సరస్వతి సిమెంట్స్‌కు విక్రయించేసిన భూములను తిరిగి ఇప్పిస్తామంటూ రైతులను మభ్యపెట్టారని చెప్పారు.
ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. సత్తెనపల్లి మండలం ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల విషయంలో సాక్షాత్తు స్పీకర్ కోడెల కుమారుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మె ల్యే, ఎంపీటీసీ సభ్యులను భయభ్రాంతులను గురిచేసినా పోలీ సులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. అవసరమైతే న్యాయ వ్యవస్థను ఆశ్రయించి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, సయ్యద్ మహబూబ్, దేవళ్ల రేవతి తదితరులు మాట్లాడారు.
నియోజకవర్గ నేత గుత్తికొండ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా విద్యార్థి సంఘం కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి, బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు మండలాల పార్టీ కన్వీనర్లు మర్రి ప్రసాదరెడ్డి, సందెపోగు సత్యం, మంగిసెట్టి కోటేశ్వరరావు, బెల్లంకొండ మీర య్య, షేక్ మస్తాన్, మాజీ మార్కె ట్ యార్డు చైర్మన్ చింతారెడ్డి సాయిరెడ్డి, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కమిటీ సభ్యుడు పానెం హనిమిరెడ్డి, చిన్నప్పరెడ్డి, బెల్లంకొండ నేత వెంకటేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కమిటీ సభ్యుడు నారు శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ లీలావతి, హరి బాబు, ఆదంషఫి, ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మనోధైర్యం నింపేందుకే..
కార్యకర్తలకు అండగా ఉండి వారి లో మనోధైర్యం నిం పేందుకే సమవేశాలు నిర్వహిస్తున్నాం. అమరావతి, బెల్లంకొండ మండలాల్లో కార్యకర్తలపై టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతూ అరెస్టు చేయిస్తున్నారు. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేసేలా సంఘటితంగా పోరాడాలి. త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తాం. చంద్రబాబు మాట నిలబె ట్టుకునే వ్యక్తికాదని ప్రజలకు అర్ధమైంది. తొలి సంతకానికి అర్ధం లేకుండా చేసిన ఘనుడాయన. రకరకాల మాటలు చెబుతూ ఒక్కపైసా రుణం కూడా మాఫీ చేయలేదు. తుఫాను బాధితులను ఆదుకోవటంలోనూ విఫలమయ్యూ రు.
- మర్రి రాజశేఖర్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుప్రజల కోసం జైలుకైనా వెళ్తా..
పార్టీ కోసం కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా ఉంటాను. ప్రజల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమే. చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తాను. టీడీపీ ధనికుల పార్టీ అరుుతే వైఎస్సార్ సీపీ పేదల పార్టీ. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాడాలి.
-నూతలపాటి హనుమయ్య, పార్టీ కేంద్ర పాలకవర్గ సభ్యుడు
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి..
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. సమస్యల పరి ష్కారానికి అందరూ కలి సికట్టుగా పోరాడాలి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిస్వార్ధ నాయకుడు. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారన్న కక్షతో అనేకమం ది వృద్ధుల పింఛన్లను అన్యాయంగా తొలగించా రు.
-సయ్యద్ మహబూబ్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు
కార్యకర్తలు కష్టపడి పనిచేయూలి
పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేయూలి. అలాగైతే 2019 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటం ఖాయం.
-దేవళ్ల రేవతి, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్
జిల్లా అధ్యక్షురాలు, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యురాలు
జగన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు గర్వించాలి
ఇచ్చిన మాట కోసం నీతిగా పోరాడుతు న్న నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నందుకు కార్యకర్తలు గర్వించాలి. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. సగం మంది పింఛన్లు తొలగించి వృద్ధులు, వితంతువులను ఏడిపిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన కు, చంద్రబాబు పాలనకు ఎంతో తేడా ఉంది.
-ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే
ప్రజలకు అండగా ఉంటా..
పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు, కార్యకర్తలకు అండగా ఉంటాను. బెల్లంకొండ మండలంలో పార్టీ కార్యకర్తలపై, అమరావతి మండలంలో సొసైటీ అధ్యక్షుడు హరిబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పింఛన్లు తొలగించటం దారుణం. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి.
-బొల్లా బ్రహ్మనాయుడు. పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల ఇన్‌చార్జి