రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన హామీలను ప్రకటించింది. 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు యువత, మహిళలు, రైతులు, కార్మికులకు 25 గ్యారంటీలను ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా వెల్లడించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంది. రైతులకు ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీని ఇస్తామని, స్టాండింగ్ లోన్ మాఫీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కార్మికులకు ఉచితంగా రోగ నిర్ధారణలు, మందులు, చికిత్స, ఆపరేషన్లు వంటివి కల్పిస్తామంది. ఉపాధి హామీ, అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల్లో పేర్కొంది.
#YuvaNYAY
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024
1. #BhartiBharosa : 30 lakh new central government jobs, according to a jobs calendar
2. #PehliNaukriPakki : One year apprenticeship for all educated youth, at Rs. 1 lakh/year (Rs. 8,500/month)
3. Paper Leak se Mukti: Law to completely end all paper leaks… pic.twitter.com/Pc4OvYgFdG
Comments
Please login to add a commentAdd a comment