సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి ప్రారంభోపన్యాసం చేశారు.
కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈనెల 28 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తాం’అని తెలిపారు.
ప్రజా పాలనను అందించడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదీచదవండి..ఆసక్తి రేపుతున్న బీఆర్‌ఎస్ ‘స్వేద పత్రం’.. కాసేపట్లో రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment