అసలు అప్పెంత? బాబు బొంకెంత? | YS Jagan Has Announced That He Is Releasing A Fact Sheet On The State Debts, More Details Inside | Sakshi
Sakshi News home page

అసలు అప్పెంత? బాబు బొంకెంత?

Published Sat, Jul 27 2024 5:06 AM | Last Updated on Sat, Jul 27 2024 10:35 AM

YS Jagan has announced that he is releasing a fact sheet on the state debts

ఇదిగో మా వాస్తవ పత్రం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఎన్నికలప్పుడు రూ.14 లక్షల కోట్లు అన్నావ్‌..

గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్ల అప్పులని చెప్పించావ్‌

వాస్తవానికి ఉన్న అప్పులన్నీ రూ.7.48 లక్షల కోట్లే

హామీలపై తప్పించుకునేందుకే చంద్రబాబు దుష్ప్రచారం

ఆ అబద్ధాలు బట్టబయలవుతాయని భయంతోనే రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా డ్రామాలు

ఏడు నెలలకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ దేశంలో ఎక్కడా చూడలేదు  

ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్‌ అంటూ ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీతో తప్పులు చెప్పించిన సీఎం చంద్రబాబును మందలించాలని కోరుతూ  గవర్నర్‌కు లేఖ రాస్తా.
 
2019 మే 30 నాటికి మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని స్వయంగా చంద్రబాబు గెజిట్‌ ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్‌ 12 నాటికి ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. నాడు రూ.వంద కోట్లే ఉన్నా రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. హామీలన్నీ అమలు చేశాం. 

ఇప్పుడు రూ.7–8 వేల కోట్ల నిధులున్నా పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెడితే అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నది బాబు భయం. హామీల అమలుకు నిధులు కేటాయించకుండా తప్పించుకునేందుకే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదు

ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్‌ ప్రకటించి మరీ డీబీటీ ద్వారా అర్హులందరికీ  కులమతాలు, పారీ్టలు, ప్రాంతాలు  చూడకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా వివక్ష లేకుండా అందించాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఇచ్చాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి బటన్‌ నొక్కి అందచేశాం. మరి మీరిచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? – వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలను ఉదహరిస్తూ అప్పులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

అసలు రంగు తెలిసిపోతుందనే భయంతో.. 
గత 52 రోజులుగా రాష్ట్రం పురోగమిస్తోందో తిరోగమిస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అణిచివేసే పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే.. పూర్తి స్థాయి రెగ్యులర్‌ బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టే ధైర్యం లేక ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే మోసపూరిత హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, హామీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. 

రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే వాల్యూమ్‌ 6, వాల్యూమ్‌ 5 ప్రకారం రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పు ఎంత? లాంటి అంశాలు వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నది చంద్రబాబు భయం. అందుకే రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు.   

వంచన.. దగా.. మోసమే చంద్రబాబు విధానం
చంద్రబాబు మోడస్‌ ఆపరండీ ఏమిటంటే.. వంచన, గోబెల్స్‌ ప్రచారం! ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయాలనుకున్నా... హామీల అమలుపై తప్పించుకోవాలన్నా దాన్ని అమలు చేస్తారు. ముందుగా ఒక కథ సిద్ధం చేసి తాను చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిపై చర్చలు కూడా పెడతారు. 

మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అందరితో అవే మాటలు మాట్లాడిస్తారు. టీవీ చర్చల్లో అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మనుషులే. చివరికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు హామీలను అమలు చేసే పరిస్థితి లేదని తీర్మానం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. వేరు పడినప్పుడు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడూ ఇదే కథ! ఎన్నికల్లో హామీలు ఇచి్చనప్పుడు.. వాటిని ఎగ్గొట్టేటప్పుడు కూడా ఇదే విధానం! 

ఇప్పుడు మొదటి కథగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి రాష్ట్రం నిజంగా ఆర్ధికంగా ధ్వంసమైందా? లేదా అన్నది ఒక్కసారి గమనిద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాటిపై అందరూ ఆలోచించాలి.  

ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే 
కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే మా హయాంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ను ప్రశంసించింది. ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతించిన దానికంటే తక్కువ అప్పు తీసుకున్నారని అభినందించింది. నేరుగా నగదు బదిలీ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే దీనికి కారణం. ‘క్వాలిటీ ఆఫ్‌ స్పెండింగ్‌ బై స్టేట్‌ గవర్నమెంట్‌ ఇంప్రూవ్డ్‌’ అని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది.  

ధర్మం వైపు నిలవండి..
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జూన్‌ 12వతేదీకి రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.5,655 కోట్లు వచ్చాయి. రెండోసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటా డబ్బులు జమయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి కనీసం రూ.7–8 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. అంత డబ్బు ఉన్నా డ్రామాలాడుతూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన అంశాలను.. వాస్తవపత్రం పేరుతో నేను చెప్పిన వాటిని ఒక్కసారి బేరీజు వేసి పరిశీలించండి. మీరంతా ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. 

విపత్తులోనూ ఆచితూచి అప్పులు
» కోవిడ్‌ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గణనీయంగా తగ్గింది.  
»    కేంద్ర పన్నుల వసూళ్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019–­20లో –3.38% తగ్గాయి. 2020–­21లో ఆ పెరుగుదల 0.85  శాతం మాత్రమే ఉంది. 
»   సాధారణంగా ఏటా కేంద్ర ప్రభు­త్వ పన్నుల వసూళ్లలో పెరుగుదల 18 నుంచి 19 శాతం ఉంటుంది.  
»    కోవిడ్‌తో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా కూడా బాగా తగ్గింది.   
»    కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని జీఎస్‌డీపీ నిష్పత్తిలో తీసుకుంటే చంద్రబాబు హయాంలో 3.72 శాతం వస్తే మా హయాంలో కోవిడ్‌ కారణంగా  2.92 శాతానికి పడిపోయింది.  
» కోవిడ్‌ వల్ల మనకు బాగా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు.. ప్రతి రాష్ట్రం కూడా అప్పు­లు ఎక్కువగా చేసుకునే అవకాశం కల్పించినా చంద్రబాబు హయాంతో పోలిస్తే తక్కువే తీసుకున్నాం.  
» చంద్రబాబు హయాంలో కాంపౌన్డ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ ఆఫ్‌ లయబులిటీస్‌ 21.63 శాతం అయితే మా హయాంలో 12.90 శాతమే ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అప్పులు 18.15 శాతం పెరగ్గా 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ పాలనలో కేవలం 13.80 శాతమే పెరిగాయి. 



ఎక్కువ అప్పులు చేసిన బాబు గొప్పవాడా? తక్కువ చేసిన మేం ఆర్థిక విధ్వంసకారులమా? 
ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని దు్రష్ఫచారం చేస్తూనే.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్, సూపర్‌ టెన్‌ అంటూ చంద్రబాబు హామీలిచ్చారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రజలు అడుగుతుండటంతో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవు. బడ్జెట్‌లో చూపించలేక అధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. చివరకు గవర్నర్‌ ప్రసంగంలో రూ.14 లక్షల కోట్లు కాస్తా రూ.10 లక్షల కోట్లకు తగ్గించారు. పోనీ నిజాలు చెప్పించారా? అంటే అదీ లేదు!   

»   చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్‌ 2 నాటికి రూ.1,18,051 కోట్ల అప్పులు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్‌ నాటికి రూ.5.18 లక్షల కోట్లకు చేరాయి.  
»   ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ 
ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు అంటే 2014 జూన్‌ 2 నాటికి రూ.5,744 కోట్లు ఉండగా ఆయన హయాం ముగిసే నాటికి రూ.50 వేల కోట్లకు ఎగబాకాయి. అనంతరం మా హయాం ప్రారంభమయ్యే నాటికి రూ.50 వేల కోట్లతో మొదలైన అప్పులు చివరకు రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి.  
»   ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు.. అంటే విద్యుత్‌ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు 2014 జూన్‌ 2 నాటికి రూ.26 వేల కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి రూ.86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి.  
»   మొత్తంగా అప్పులు ఎంత? అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పులు, గవర్నమెంట్‌ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్‌ 2 నాటికి రూ.1,23,343 కోట్లు ఉంటే ఆయన వైదొలగే నాటికి రూ.4.08 లక్షల కోట్లకు ఎగబాకాయి.  
»    మేం అధికారం చేపట్టే నాటికి రూ.4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి రూ.7.48 లక్షల కోట్ల అప్పులున్నాయి.  
»    చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 21.63 శాతం ఉంటే  మా హయాంలో అది 12.93 శాతమే ఉంది. అంటే 21.63 శాతం అప్పులు చేసిన వాడు గొప్ప­వాడా? ఆరి్థక విధ్వంసకారుడా? 12.93 శాత­మే అప్పులు చేసిన మేం ఆర్థికంగా ధ్వంసం చేసినట్లా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి.  
»   రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నట్లు రాజ్యసభకు తెలియచేశారు. నేను జూన్‌ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా. వాళ్లు ఇచి్చన స్టేట్‌మెంట్‌లో రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడ నుంచి వచి్చంది ఈ రూ.పది లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగానే చిత్రీకరించి చూపించడం ధర్మమేనా?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement