హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేతపత్రాల పేరుతో డ్రామా
సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగిపారేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లఅప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు
రూ.పది లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్‌తో తప్పులు చెప్పించావు
ఇంతకూ ఏ లెక్క కరెక్ట్ బాబూ..?
వాస్తవంగా ఉన్న అప్పులు రూ.7.48 లక్షల కోట్లేగా.. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా?
2019 మే 30 నాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నా మేం రూ.2.27 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం
ఇప్పుడు ఖజానాలో రూ.7–8 వేల కోట్లున్నా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు బాబూ?
అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలేనని తేలిపోతుందనే కదా నీ భయం
హామీల అమలుపై ప్రజల నిలదీస్తారనే భయంతో మాపై దాడులు, విధ్వంసాలు
ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం.. ఆటవికం.. రెడ్‌బుక్ పరిపాలనగా మార్చేశావు..
శాసనసభలో మేం నిలదీస్తామనే భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు
శాసనసభలో ఉన్నది రెండు పక్షాలే. ఒకటి అధికారపక్షం.. రెండు ప్రతిపక్షం. కానీ ప్రజల గొంతుక విన్పించకూడదనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రతి పక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుక విన్పించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే పాలక పక్షం సాగిస్తున్న ఆటవిక పాలన, విధ్వంసకాండ గురించి గళమెత్తుతాం. ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్నకుండిపోము. మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం చంద్రబాబునాయుడు శ్వేత పత్రాల పేరుతో డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు వల్లె వస్తూ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలన్నీ తప్పుడు పత్రాలేనని స్పష్టం చేశారు. ఆ శ్వేతపత్రాల్లో తప్పులను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. వాస్తవ పత్రాల(ఫ్యాక్ట్ షీట్స్)ను తాము విడుదల చేస్తున్నామని చెప్పారు.
శ్వేతపత్రాల్లో చంద్రబాబు చెప్పిన అంశాలను.. ఫ్యాక్ట్ షీట్స్‌లో తాము చెబుతున్న వాస్తవాలను పరిశీలించి.. ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలన్నీ అబద్ధపు, తప్పుడు పత్రాలేనని సాక్ష్యాధారాలు, గణాంకాలతో నిరూపించారు.
ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పు రూ.14 లక్షల కోట్లని దు్రష్ఫచారం చేసిన చంద్రబాబు.. గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.పది లక్షల కోట్లుగా చూపించారని ఎత్తిచూపారు. వాస్తవానికి రాష్ట్ర అప్పు రూ.7.48 లక్షల కోట్లేనని కాగ్ (కాం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను చూపారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా, తక్కువ అప్పులు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించామని కేంద్ర సామాజిక ఆరి్థక సర్వే ప్రశంసించిందన్నారు.
బండారం బయట పడుతుందని నాటకాలు
2019 మే 30 నాటికి తాము అధికారంలోకి వచి్చనప్పుడు రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.వంద కోట్లే ఉన్నాయని టీడీపీ గెజిట్ ఈనాడు కథనాన్ని ప్రచురించిందని వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే 2019–20కి సంబంధించి రూ.2.27 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గుర్తు చేశారు. కానీ జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7–8 వేల కోట్ల నిధులు ఉన్నా, పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని దెప్పి పొడిచారు.
పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాల్సి వస్తుందని, నిధులు కేటాయించకపోతే.. హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పుపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది బయట పడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. ఏడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకున్న దాఖలాలు లేవని ఎత్తిచూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే లక్ష్యంతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. 52 రోజులుగా రాష్ట్రంలో సాగుతోన్న నరమేధమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
హామీలన్నీ వెంటనే నిలబెట్టుకున్నాం
వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలన్న ధృఢ నిశ్చయంతో ఆనాడు మేము నవరత్నాలు ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక ఇచి్చన హామీలన్నీ అమలు చేశాం. రాష్ట్రంలో ఇప్పటికీ రాజకీయ, ఆరి్థక, సామాజిక స్వాతంత్య్రాన్ని పొందలేక పోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్ట్‌ల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశాం. గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. మద్యాన్ని తగ్గించి, మాన్పించే విధానాన్ని అమలు చేశాం.
పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడుతున్నారని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామని ఏకంగా చట్టాలు చేశాం. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్ద పీట వేస్తూ, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలు తీసుకువచ్చాం. శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పే సామాజిక న్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకువచ్చాం.
అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కీలక చట్టాలు
అసెంబ్లీ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం. అది మా ప్రభుత్వం మాత్రమే చేసింది. అదే రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరో చట్టం చేశాం. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా, వారి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టే విధంగా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేశాం.
మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో బెల్టు షాపులు మూయించడమే కాకుండా, అవి శాశ్వతంగా మూతబడాలని, అవి మళ్లీ తెరిచే అవకాశం ఉండకూడదని, 2019 అక్టోబరు 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా ఉచితంగా పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేశాం. అది కూడా అధికారంలోకి వచి్చన కేవలం రెండున్నర నెలల్లోనే.
హామీలపై నోరుమెదపని చంద్రబాబు
ఇప్పుడు.. ఇచి్చన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తావంటే చంద్రబాబు సరైన సమాధానం చెప్పడు. పోలవరం ఎప్పుడు కడతావంటే.. ఎప్పటికి అవుతుందో తెలియదు అంటాడు. పోనీ అమరావతి అయినా ఎప్పుడు కడతావు అంటే.. నువ్వు చెప్పు అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు.. ఎప్పుడు చేస్తావు అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు.. ఇప్పుడు ఇంతలా అమ్ముతున్నావంటే ఏం.. మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పానా? అంటాడు. మెగా డీఎస్సీ అన్నాడు.. నువ్వు రాకముందే 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
నువ్వు ఇచ్చింది 10 వేల పోస్టులే కదా.. ఇది మెగా ఏంటి? అంటే దానికీ సమాధానం ఉండదు. ఆ రిక్రూట్‌మెంట్ కూడా వాయిదా వేసుకుంటూ వెళ్లారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని వారిని రోడ్డున పడేశారు. ఇంటింటికీ రేషన్ సప్లైని ఆపేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ కత్తిరింపులు ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు. ఇవన్నీ అడగకూడదని ఇక ఏం చేస్తున్నారు అంటే.. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులకు నష్టం చేకూర్చడం, ఒక భయాన్ని క్రియేట్ చేయడం.. ఇదీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీరు.
రివర్స్ టెండరింగ్
కమీషన్లు, దోపిడీకి మారుపేరుగా మారిన పరిస్థితుల్లో ఆ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలోనే సంస్కరణలు చేపట్టాం. ఆ మేరకు జ్యూడిíÙయల్ ప్రివ్యూ యాక్ట్.. చట్టం తీసుకువచ్చాం. టెండరు పనుల ప్రారంభ ప్రక్రియను పూర్తిగా హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టాం.
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంటు ఇస్తూ తద్వారా రూ.720 కోట్ల మేర వారికి ప్రయోజనం కలిగించాం. ఇంకా పంటలకు గిట్టుబాటు ధరలు కలి్పంచడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.
పవర్‌పై అన్నీ కోతలే
విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే దేశంలో ముందు ఏపీనే కనిపిస్తుందని, ఇక్కడ ఆ రంగంలో అన్ని సంస్కరణలు జరిగాయన్నారు.
చంద్రబాబు రాక ముందు 2014–15లో పంపిణీ సంస్థల విద్యుత్ నష్టాలు రూ.6,625.88 కోట్లు ఉంటే.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో.. 2018–19 నాటికి అవి ఏకంగా రూ.28,715 కోట్లకు ఎగబాకాయన్నారు. అంటే 34 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రూ.28,715 కోట్లతో మొదలైన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కొంతే పెరిగి.. 2023–24 నాటికి రూ.29,110 కోట్లకు చేరాయన్నారు.
అంటే ఐదేళ్లలో పెరిగిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కేవలం 0.34 శాతమేనని, ఆ మొత్తం రూ.395 కోట్లేనని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో ఆ నష్టాలు ఏకంగా 34 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా ‘సెకీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనిపైనా దు్రష్పచారం ధర్మమేనా.. అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment