చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు.
మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment