20 నుంచి ఆర్‌ఎస్‌వైఎఫ్‌ జీపు జాతా | 20 ARYF jeep JAATA | Sakshi
Sakshi News home page

20 నుంచి ఆర్‌ఎస్‌వైఎఫ్‌ జీపు జాతా

Published Sun, Mar 12 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

20 ARYF jeep JAATA

కడప వైఎస్సార్‌ సర్కిల్‌: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి జీపుజాతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం ఆర్‌సీపీ కార్యాలయంలో  రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం విద్యార్థి, యువత సమస్యలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాయలసీమ ప్రాంతానికి 35 శాతం నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్‌ నాయకులు శంకర్, నరసింహా, భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement