చంద్రబాబూ నాటకాలు కట్టిపెట్టు | Chandrababu plays kattipettu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ నాటకాలు కట్టిపెట్టు

Published Mon, Oct 13 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

చంద్రబాబూ నాటకాలు కట్టిపెట్టు

చంద్రబాబూ నాటకాలు కట్టిపెట్టు

విద్యానగర్(గుంటూరు)
 రుణమాఫీ తదితర హామీలను నెరవేర్చలేక ప్రజలను ప్రలోభాలతో మభ్యపెట్టేందుకు చంద్రబాబు పన్నుతున్న కుట్రలకు తెరదించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం   విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి హైదరాబాద్‌లోని తమ పార్టీ అధినాయకుడు జగన్ ఇంటిపైకి 5 బస్సులతో జనాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేయాని డిమాండ్ చేశారు.

భూములు తిరిగి ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి తమతో ధర్నా చేయించారని సరస్వతీ సిమెంట్స్ భూముల పరిసర ప్రాంతాల  రైతులే చెబుతున్నారన్నారు. రైతుల రుణాలు ప్రభుత్వం చెల్లించేవిధంగా చర్యలు తీసుకోనున్న జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు పన్నిన కుట్రల్లో భాగమే ఈ వివాదాస్పద కార్యక్రమాలని ఆరోపించారు. కంపెనీకి చెందిన భూములను రౌడీయిజంతో అనుభవిస్తున్నవారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని, రౌడీలను వెంట తీసుకెళ్లి ఇంటి ముందు ధర్నా చేసిన ఎమ్మెల్యేపై ఎందు కు కేసు నమోదు చేయలేదని ప్రశ్నిం చారు.

విలేకరుల సమావేశంలో ఎస్సీసెల్  రాష్ట్రకమిటీ సభ్యుడు ఎమ్ దేవరాజ్, జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకుడు చిలకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement