‘వీటిని స్టాక్‌ పెట్టుకోండి’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సెటైర్లు | ktr satires congress party six guarantees Request to citizens stock up products | Sakshi

‘వీటిని స్టాక్‌ పెట్టుకోండి’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సెటైర్లు

May 9 2024 10:17 AM | Updated on May 9 2024 10:48 AM

ktr satires congress party six guarantees Request to citizens stock up products

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా.. కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు.

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల  హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చురకలు అంటించారు. ప్రస్తుతం ఉ‍న్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. బీఆర్‌ఎస్‌ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా.. కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు. 

అందులో... 1. ఇన్వర్టర్. 2. ఛార్జింగ్ బల్బులు. 3. టార్చ్ లైట్లు. 4. కొవ్వొత్తులు. 5. జనరేటర్లు. 6. పవర్ బ్యాంకులను నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. వీటీనే కాంగ్రెస్‌ పార్టీ  ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని  ఎద్దేవా చేశారు. 

గ్యారంటీల హామీ ఇచ్చి.. ​వాటీని స్టాక్‌ పెట్టుకోవల్సిన పరిస్థితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అందుకే మే 13 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ ప్రజలను కోరారు.

 

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ప్రధాని మోదీజీ.. అదానీ, అంబానీ స్కాంగ్రెస్‌(కాంగ్రెస్‌)కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే.. ఆయన అభిమాన మిత్రులైన ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. డీమోనిటైజేషన్‌ వైఫల్యం అని కూడా ఆయన ఒప్పుకుంటారా?’ అని కామెంట్స్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement