
మాఫీ పేరుతో ప్రజలకు టోపీ..
టీడీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చంద్రగిరి శాసన సభ్యులు డాక్టర్ ....
బాబుది రాక్షస పాలన
డ్వాక్రా రుణాలు మాఫీ కాక అప్పుల ఊబిలో మహిళలు
బ్యాంకుల్లో వడ్డీపై వడ్డీ కడుతూ అన్నదాతల ఆత్మహత్యలు
చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి
రామచంద్రాపురం: టీడీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చంద్రగిరి శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ తహశీల్దార్ కెపీ భాగ్యలక్ష్మికి ఆమె కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బూటకపు హామీలు గుప్పించి ఓట్లు వేయించుకుని చంద్రబాబు గద్దెనెక్కారని, అధికారం వచ్చిన తరువాత హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తరువాత వారికి మొండి చెయ్యి చూపించారుని ఎద్దేవా చేశారు. రుణాలు మాఫీ కాక మహిళలు అప్పుల ఊబిలో కూరుకు పొయారన్నారు.
రైతులకు రుణ మాఫీ పేరుతో కొద్దోగొప్పో చేసి ప్రచారం చేసుకుంటున్నారని, రైతులకు 70 శాతం పైగా మాఫీ వర్తించక బ్యాంక్‌ల్లో వడ్డీలకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించారన్నారు. చంద్రబాబుది రాక్షస పాలనే తప్ప ప్రజా పరిపాలన కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవీ బ్రహ్మానందరెడ్డి, గురుస్వామిరెడ్డి, భాను కుమార్ రెడ్డి, పుష్పకాంత్ రెడ్డి, మురళీ నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు, పాల్గొన్నారు.