
హామీలను అమలు చేయూలి
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయూలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి
ఎర్రుపాలెం : ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయూలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పగటిపూట తొమ్మిది గంటలు కరెంటు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆరు గంటలలోపే ఇస్తున్నారన్నారు.
కరువుతో రైతులు అల్లాడుతుంటే నేటికి ప్రభావ మండలాలను ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఈనెల 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను కార్యకర్తలు జయప్రదం చేయూలన్నారు. మండలంలోని పెగళ్లపాడు ఆర్‌ఓబీ పనులు ఇప్పటికే ఆలస్యమయ్యూయని త్వరితగతిన పూర్తి చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటీసీ, పార్టీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లక్కిరెడ్డి న ర్సిరెడ్డి, మండల మహిళా కన్వీనర్ వేమిరెడ్డి త్రివేణి, ఎంపీటీసీలు శీలం అక్కమ్మ, సామనూరి కృష్ణార్జునరాజు, గుర్రాల పుల్లారెడ్డి, షేక్ హుస్సేన్, గూడూరు నర్సింహారెడ్డి, దేవరకొండ రవి, యన్నం కోటిరెడ్డి, దేవరకొండ భూషణం, శీలం వెంకటేశ్వరరెడ్డి, శీలం కృష్ణారెడ్డి తదితరులున్నారు.