
కొనసాగుతున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, ప్రారంభానికి నోచుకోని మినీ స్టేడియం
మినీ స్టేడియం ప్రారంభం, డిగ్రీ కాలేజీ నిర్మాణం ఇక్కడి ప్రజలకు కలగానే మారుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులు, క్రీడాకారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్లుగా ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం, అనంతరం పాలకులు పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో విద్యార్థులు, క్రీడాకారులకు ఇబ్బందులు షరామామూలుగానే మారుతున్నాయి.
సాక్షి, షాద్‌నగర్ రూరల్: షాద్‌నగర్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల అభివృద్ధి కోసం 1994 సెప్టెంబర్ 22న అప్పటి ప్రభుత్వంలోని యువజన క్రీడల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు శంకుస్థాపన చేశారు. పాతికేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఎట్టకేలకు సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తయింది. అయినా, నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారే తప్పా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయడం లేదు.
పాలకులు మినీ స్టేడియం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మినీ స్టేడియంలో నిర్మించిన భవనం ప్రారంభం కాకముందే శిథిలావస్ధకు చేరుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు శిక్షణ తీసుకునేందుకు, తమ ప్రతిభను వెలికితీసేందుకు సరైన వేదిక లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు మినీ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
నత్త నడకన నిర్మాణం
పట్టణంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం నేటికి కొనసాగుతూ నత్త నడకను తలపిస్తోంది. సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ పూర్తి కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే డిగ్రీ కళాశాలను కొనసాగిస్తున్నారు. ఉదయం జూనియర్ కళాశాల, మధ్యాç ßæ్నం సమయంలో డిగ్రీ కళాశాలను కొనసాగిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు.
}
కళాశాలకు హాజరయ్యేందుకు సమయానికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విద్యతోనే అభివృద్ది సాధ్యమని చెపుతున్న పాలకులు, అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డిగ్రీ కళాశాల భవ న నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యా ర్థులు డిమాండ్ చేస్తున్నారు
ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు
గతంలో షాబాద్, మద్దూరు నియోజకవర్గాలు
షాబాద్(చేవెళ్ల): నిజాం కాలంలో ఇప్పటి షాబాద్ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతుండేది. 1949లో షాబాద్ నియోజకవర్గంగా అవతరించింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కొండా వెంకటరంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత 1954లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొండా వెంకట రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి రామారావు చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 1962లో చేవెళ్ల నియోజకవర్గం ఏర్పడింది. షాబాద్ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు.
1972లో తిరిగి షాబాద్ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గం నుంచి విడదీసి పరిగి నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో పరిగి నుంచి ఒకసారి కమతం రాంరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత అహ్మద్ షరీఫ్ ఒకసారి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో షాబాద్ మండలాన్ని తిరిగి చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు. అయితే, నాటి నుంచి నేటి వరకు షాబాద్ మండలం అభ్యర్థుల గెలుపుఓటముల విషయంలో కీలకంగా మారింది.
అప్పటి మద్దూరు..
గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా.. ప్రస్తుత వికారాబాద్‌లో కొనసాగుతున్న మద్దూరు మండలం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1962 సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో మూడు రెవెన్యూ సమితిలు ఉండేవి. మద్దూరు, కోయిలకొండ, ధన్వాడ. ఈ మూడు రెవెన్యూ సమితిలను కలిపి జనాభా ప్రతిపాదికన మద్దూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ఎస్సీకి రిజర్వ్‌డ్ చేశారు. అనంతరం మద్దూరు రెవెన్యూ సమితితో పాటు కొడంగల్ రెవెన్యూ సమితిని కలిపి కొడంగల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.
అయితే, మద్దూరు రెవెన్యూ సమితిలో ప్రస్తుత మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలు ఉండేవి. 1962లో జరిగిన ఎన్నికల్లో నారాయణపేటకు చెందిన ఈ.బసప్ప(కాంగ్రెస్) స్వతంత్ర అభ్యర్థి నర్సింగ్‌రావుపై గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మద్దూరు, కోస్గిని కొడంగల్‌లో కలిపారు. దామరగిద్ద సమితి నారాయణపేట నియోజకవర్గంలో కలిసింది. ఇక జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపేశారు. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో చేర్చారు.
ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు
పాలకులు పట్టించుకోవాలి
పట్టణంలో మినీ స్టేడియం పనులు పూర్తయినా ప్రారంభించడం లేదు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రాంతంలో క్రీడాకార్లుల్లో మంచి ప్రతిభ ఉంది. దానిని గుర్తించి వెలికితీయాల్సిన అవసరం ఉంది. – స్వాములు, పీఈటీ, షాద్‌నగర్
హామీలు నెరవేర్చాలి
ప్రతి ఎన్నికల్లో డిగ్రీ కాలేజీ, మినీ స్టేడియం విషయంలో నేతలు హామీలు ఇస్తున్నారే తప్పా తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సర్కారు వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలి. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – టీజీ శ్రీనివాస్, వొకేషనల్ కళాశాల అధ్యాపకుడు, షాద్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment