ఆర్డినెన్స్‌ పేరుతో నాటకం | Buggana Rajendranath comments over govt | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌ పేరుతో నాటకం

Published Thu, Aug 1 2024 5:42 AM | Last Updated on Thu, Aug 1 2024 5:42 AM

Buggana Rajendranath comments over govt

ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన  

సూపర్‌ సిక్స్‌ హామీలు ఎగ్గొట్టేందుకే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌  

2019 మే 30 నాటికి ఖజానాలో మిగిలింది రూ.100 కోట్లే 

అయినా 2019 జూలై 12న రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం 

ఈ ఏడాది జూన్‌ 10న పన్నుల్లో వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు విడుదల చేసిన కేంద్రం 

జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నుల్లో రాష్ట్ర వాటా, గ్రాంట్ల రూపంలో నిధుల లెక్కపై స్పష్టత

అయినా సరే పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టక పోవడం సంప్రదాయాలకు విరుద్ధం కాదా?  

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవు­తుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్‌ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. 

కోవిడ్‌ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్‌ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్‌ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.

అబద్ధాలు బయట పడకూడదనే.. 
» పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. 
»    పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని 
ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా?  
»    దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని 
ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? 
»    మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా?  
»    తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా?  
»    50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్‌ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? 
»    రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హా­మీ­­ని అమలుచేయకుండా మోసం చేస్తారా? 
»    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? 
»    రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్ర­బాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పు­డు లెక్కలు చెప్పా­రు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement