సాక్షి, అమరావతి: వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది.
‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి.
మంత్రి సమాధానంపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.
‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.
వలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్సార్‌సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment