AP Grama Volunteers Protest Against Pawan Kalyan Comments In Eluru Sabha, Details Inside - Sakshi
Sakshi News home page

AP Volunteers Protest: పవన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

Published Mon, Jul 10 2023 12:05 PM | Last Updated on Mon, Jul 10 2023 5:25 PM

AP Volunteers Protest Against Pawan kalyan Comments - Sakshi

సాక్షి, ఏలూరు: ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మేరకు ఏలూరులో వాలంటీర్లు. పవన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ.. తక్షణమే తమకు పవన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ జిల్లా
పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇసుకతోట హైవేపై వాలంటీర్లు బైఠాయింపు
పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా నినాదాలు
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏలూరు జిల్లా
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడు పట్టణం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన  వాలంటీర్లు. సంఘీభావం తెలిపిన వైసీపీ శ్రేణులు.

కాకినాడ జిల్లా
పవన్ కళ్యాణ్ వాఖ్యలకు నిరసనగా జగన్నాధపురం మునసిబ్ గారి సెంటర్ లో వాలంటీర్ల నిరసన.
పవన్ కళ్యాణ్ చిత్రపటాలు దగ్ధం
వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

విజయనగరం జిల్లా
మహిళా సంఘాలకు పడవలసిన ఆసరా డబ్బులు ఇంతవరకు పడలేదని వెలుగు ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తపరిచిన మంత్రి బొత్స.
సభా వేదికపై మహిళా పోలీస్ చేత దిశా యాప్ ను  మహిళా పోలీస్ ద్వారా పరీక్షించిన మంత్రి..
జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఘనంగా చెప్పిన విద్యాశాఖ మంత్రి బొత్స.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుండి ఖండిస్తూ మైక్ ఉందని మాట్లాడకూడదు అంటూ ఎద్దేవా బొత్స.
స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాల?లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పదకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాల మీరే చెప్పండి?అంటూ ప్రజలను ప్రశ్నించిన మంత్రి..

బాపట్ల జిల్లా
►వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి.
►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారనడం సరైన పద్ధతి కాదు.
►పవన్ కల్యాణ్ ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.
►సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరుస్తున్న వాలంటీర్లను అవమానిస్తే సహించం.
►ప్యాకేజీ స్టార్ సినిమా డైలాగులు బయట వాడితే సరైన బుద్ది చెబుతాం.
►వేటపాలెం మండలం పందిళ్ళ పల్లి  గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన చీరాల నియోజవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి కరణం వెంకటేష్.

►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పర్చూరు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఫైర్
►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై ఆమంచి సీరియస్..
►ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్
►చంద్రబాబు ఆడినట్లు ఆడటం మంచిదికాదని సూచన
►వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పి గౌరవం నిలుపుకోవలని హితవు

కృష్ణాజిల్లా
►పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మండిపడుతున్న వాలంటీర్స్
►తక్షణమే పవన్ తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి
►బేషరతుగా వాలంటీర్స్ కు క్షమాపణ చెప్పాలి 
►వాలంటీర్స్ అంటే ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధులు 
►వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నాడు 
►వాలంటీర్ల వల్లే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనడం చాలా దుర్మార్గం
►వాలంటీర్లలో 60% మంది మహిళలమే ఉన్నాం
►పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా
►మేం పవన్ కళ్యాణ్ కు మహిళల్లా కనిపించడం లేదా?
►వాహనమెక్కి రోడ్ల వెంట తిరుగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు
►చేతనైతే గ్రామాల్లోకి వచ్చి మేం చేస్తున్న సేవలను తెలుసుకో పవన్ కళ్యాణ్


ఏలూరు జిల్లా
►నిన్న ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన స్త్రీ , శిశు సంక్షేమ రీజనల్  చైర్మన్ వందనపు సాయి బాల పద్మ.
►రాష్ట్రంలో కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు పవన్ కంటికి కనపడలేదా...??
►చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పై పవన్ కళ్యాణ్ అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి...
►వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచేది మేమే...
►వాలంటీర్లు అంటే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీ లు కాదు...
►మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామం లో  పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వాలంటీర్లు
►పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం లో వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం.

చదవండి: పవన్‌ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement