అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో వలంటీర్ల మానవహారం
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు.
దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment