అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే..
ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్‌ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క..
నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే..
అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న
YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?
మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment