సాక్షి, తిరుపతి: మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు.
"వలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడిగే వాళ్లు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వలంటీర్లు. వాళ్లంతా మన గ్రామం పిల్లలే.. మన వాళ్లే. అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు" అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
"వలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావుది. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ కూడా దత్తపుత్రుడివే. వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని, ట్రాఫికింగ్ చేస్తున్నారని, మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిసిగ్గుగా ఒకరంటున్నారు. వలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారు. పైగా సిగ్గులేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఆ రాతలను ప్రచురిస్తున్నాయి."
"చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో అందరినీ తెలుసు. యూట్యూబ్‌లో చూస్తే ఒకరు ‘‘అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, స్విమ్మింగ్‌పూల్‌లో అమ్మాయిలతో కనిపిస్తాడు’’. మరొకరు ‘‘అమ్మాయి కనిపిస్తే ముద్దులు పెట్టాలి.. కడుపైనా చేయాలి’’ అంటాడు. ఇంకొకరు ‘‘టీవీ షోకి వెళ్లి.. బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను’’ అంటాడు. ఇంకొకడిదేమో ‘‘బాబుతో పొత్తు.. బీజేపీతో కాపురం. ఇచ్చేది బీఫాం.. టీడీపీకి బీ టీం’’.
"వలంటీర్ల క్యారెక్టర్లను దత్తపుత్రుడు తప్పుబట్టి.. వాళ్లను అవమానించారు. మన వలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకున్నారా?.. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కల్యాణ్ క్యారెక్టర్. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి మాట్లాడేది. ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధంపెట్టుకునే వ్యక్తా వలంటీర్ల వ్యక్తిత్వం మాట్లాడేది. అసలు వలంటీర్లను తప్పుబట్టింది.. పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్. వలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ల నుంచి సేవలు అందుకుంటున్న కోట్ల మందికి తెలుసు" అని అన్నారు.
"మేం చేస్తున్న మంచి మరో చర్రిత.. ఇది మీ బిడ్డచరిత్ర. పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం మన చరిత్ర. గతంలో ఎన్నడూ లేనవిధంగా సామాజిక న్యాయం అందించాం. అన్ని వర్గాలకు మంచి చేశాం. మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. రానున్న రోజుల్లో మీ బిడ్డ గురించి.. మీ బిడ్డ ప్రభుత్వం గురించి చెడుగా మాట్లాడతారు. అబద్ధాలను, మోసం చేసేవారిని నమ్మకండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా? అనేది చూడండి.. ఆదరించండి.." అని సీఎం జగన్ ఏపీ ప్రజలను కోరారు.
చదవండి: వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment