సాక్షి, చిత్తూరు : కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఆమోఘమని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కొనియాడారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా నగరి రూరల్ పరిధిలోని వాలంటీర్లకు నిత్యావసరాలను అందజేశారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి వారానికి సరిపడా సరుకులను అందజేశామన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయటం మానుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment