సాక్షి, తాడేపల్లి: పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై కక్ష కట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ పేదలకు మేలు చేసేందుకు వాలంటీర్లను తెచ్చారని.. చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే గిట్టదన్నారు. పేదలకు మంచి చేసే ఏ పనీ చంద్రబాబుకు నచ్చదని దుయ్యబట్టారు.
‘‘పెన్షన్ సౌకర్యాన్ని ఆపేందుకు చంద్రబాబు అండ్‌కో ప్రయత్నించారు. సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పుడుతోంది. పాలనలో సేవలను అడ్డుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం. సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ. చంద్రబాబు దిగజారిన రాజకీయ నాయకుడు. వాలంటీర్ల అంటే చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు గిట్టుదు. వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒక వైపు చెబుతున్నారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘పవన్ కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. భీమవరంలో ఉంటానంటూ గత ఎన్నికల టైంలో పవన్ చెప్పారు. పవన్ కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. భీమవరంలో ఉంటానంటూ గత ఎన్నికల టైంలో పవన్ చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ వేడుకుంటున్నాడు. ఎమ్మెల్యే అయితే చాలని పవన్ అనుకుంటున్నారు. సీఎం జగన్ ప్రభుత్వమే వస్తుందని కూటమికి అర్థమైంది. ఎంత మంది కలిసొచ్చినా జగన్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ చంద్రబాబు జేబు సంస్థ. దాని అధ్యక్షుడు జస్టిస్ భవానీ ప్రసాద్. ఈయన చంద్రబాబు హయాంలో పదవులు పొందారు. కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్‌గా ఉండి సుజనచౌదరి, కామినేని శ్రీనివాసరావులతో రహస్యంగా హోటల్లో కలిసిన వ్యక్తి. హైకోర్టు, సుప్రీంకోర్టులలో కపిల్ సిబల్ వీరికి అడ్వకేట్. ఇంటింటికీ తిరిగి పెన్షన్లు ఇవ్వొద్దని వీరంతా కలిసి కేసులు వేశారు. జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుందని వీరికి కడుపు మంట. గత ఆరు నెలలుగా ఎన్నికల లక్ష్యంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
ఈనాడులో జగన్‌పై ఏం వార్తలు రాసినా ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?. ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయింది?. ఈనాడులో వార్త రావటం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం ఏంటి?. చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. భువనేశ్వరి మూడు లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. దానిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వరు?. ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు?. ఈ పక్షపాత ధోరణిలో ఎన్నికల సంఘం ఎందుకు వ్యవహరిస్తోంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.
‘‘వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి విషం చిమ్ముతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించారు. కోడ్ వచ్చాక వారికి తర్వాత యాభై వేల జీతం ఇస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు. వాలంటీర్లపై వేటు వేయించటం ద్వారా పేదలందరినీ ఇబ్బందులు పెట్టారు. మూడు నెలల పాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా చంద్రబాబు బ్యాచ్ కుట్ర పన్నింది. వీరి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి’ అని పేర్ని నాని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాలి. మాట ఇస్తే వెనక్కి వెళ్లే మనిషిని కాదని పవన్ అంటున్నారు. భీమవరంలో కూడా ఇదే మాట అన్నారు. భీమవరం ప్రజల సేవే నాకు ముఖ్యమంటూ అప్పట్లో చెప్పి ఏం చేశారో జనం చూశారు. పిఠాపురంలో ప్రయివేటు ఆస్పత్రి కట్టిస్తానని పవన్ అంటున్నారు. అంటే.. తమ కూటమి ఓడిపోతుందనీ, మళ్ళీ జగనే గెలుస్తాడని పవన్ కి అర్ధమైంది. జగన్ బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. వాలంటీర్లను పక్కన పెట్టగలరేమోగానీ, జనానికి జగన్ మీద ఉన్న ప్రేమను ఆపలేరు. బీజేపీకి ఓటేయొద్దని చంద్రబాబు అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థి పేరు తెలియక నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment