‘వలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు’ | Perni Nani Slams Chandrababu Over Volunteer Promises | Sakshi
Sakshi News home page

రాబోయేది సంక్షేమ ప్రభుత్వమే.. వలంటీర్ల బాగు చూసేది సీఎం జగనే

Published Wed, Apr 10 2024 9:24 AM | Last Updated on Wed, Apr 10 2024 10:45 AM

Perni Nani Slams Chandrababu Over Volunteer Promises - Sakshi

కృష్ణా, సాక్షి: నాలుగున్నరేళ్లుగా క్షోభపెట్టి.. ఇప్పుడు వలంటీర్లకు గాలం వేస్తున్నావా? అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. అయితే వలంటీర్లంటే నిస్వార్ధ సేవకులని, వారికి గాలం వేయడం అంత సలువు కాదని బాబుకి పేర్ని నాని చురకలంటించారు. 

‘‘నాలుగున్నరేళ్లుగా మీరు(బాబు అండ్‌ కో) పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారనుకుంటున్నారా?. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. బాంబే రెడ్‌ లైట్‌ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారన్నారంటూ వలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. పైగా మూటలు మోసే ఉద్యోగం, మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొడతారని వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్యలన్నీ చంద్రబాబు మర్చిపోయారా?.. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలను వలంటీర్లుగా మారుస్తావని వారికి(వలంటీర్ల) తెలియదా?. 

చంద్రబాబూ.. నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు.  రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్‌ గారంటే ఏంటో తెలుసు. వచ్చేది జగన్‌ ప్రభుత్వమే అనేదీ వలంటీర్లకు తెలుసు. జగన్‌ ప్రభుత్వంలో వారి సంక్షేమం, బాగోగులు ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని పేర్ని నాని అన్నారు. 

అంతలా క్షోభపెట్టి ఇప్పుడు.. 

  • బూటకాలకు, నయవంచనకు మారు పేరైన నారా చంద్రబాబునాయుడు వివిధ కులాలకు గాలం వేయడం అయిపోయింది. 
  • కులాలను వాడుకుని వదిలేసి మోసం చేయడం కూడా అయిపోయింది. 
  • రాష్ట్ర ప్రజలకు కూడా గాలం వేయడం, వారిని వాడుకోవడం, విసిరి పారేయడం అయిపోయింది. 
  • కొత్తగా ఇప్పుడు వలంటీర్లకు కూడా చంద్రబాబు గాలం వేస్తున్నాడు. 
  • ఆ గాలానికి ఎరగా గౌరవవేతనం పదివేలు చేస్తానంటున్నాడు. 
  • పదివేలు చేస్తానన్న పెద్ద మనిషి ఎవరయ్యా అంటే గత నాలుగున్నరేళ్లుగా వలంటీర్లను మానసికంగా క్షోభకు గురిచేసిన చంద్రబాబు 
  • వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 
  • బాంబే రెడ్‌ లైట్‌ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారని వాళ్ల పార్టనర్‌ అంటే..మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్లను లొంగదీసుకుంటారని మాట్లాడని వ్యక్తులు వీళ్లు. 
  • మూటలు మోసే వారని, డేటాను ఇతర దేశాలకు అమ్ముతారని వీళ్లంతా ఇష్టారీతిన మాట్లాడారు. 
  • తన రాజకీయం కోసం పట్టుమని ముప్పై ఏళ్లు కూడా నిండని ఆడ, మగ పిల్లల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. 
  • ప్రజలు ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా జగన్‌ గారి ప్రభుత్వంలో పథకాలను వారి గుమ్మం వద్దకే తీసుకెళ్లిన వ్యవస్థ వలంటీర్‌ వ్యవస్థ. 

ముక్కలు చేయాలని కుయుక్తులు

  • వలంటీర్‌ వ్యవస్థను ముక్కలు ముక్కలు చేద్దామని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. 
  • ఆ ప్రయత్నంలో భాగంగా వారిని ఎంత దిగజార్చాలో అంత చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరిచాడు. 
  • చంద్రబాబు తాబేదారు నిమ్మగడ్డ రమేష్‌ అనే వ్యక్తి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు కోసం పనిచేశాడు.
  • ఇప్పుడు ప్రజా స్వామ్య పరిరక్షణ అంటూ రిటైర్‌ అయిన తర్వాత కూడా చంద్రబాబు కోసం ఓ డమ్మీ సంస్థను ఏర్పాటు చేశాడు. 
  • చంద్రబాబు రాజకీయం కోసం ప్రజాస్వామ్యం అనే ముసుగు వేసుకుని ఈ నిమ్మగడ్డ పనిచేస్తున్నాడు. 
  • అలాంటి నిమ్మగడ్డ వలంటీర్లు పింఛన్లు పంచకూడదు, ప్రజలకు గుమ్మంలోకి సేవలు అందించకూడదని హైకోర్టులో కేసు వేశాడు. 
  • ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా కేసులు వేశాడు. 
  • ఎక్కడా వీళ్ల ఆటలు సాగలేదని బీజేపీ పొత్తు ప్రభావంతో వలంటీర్‌ల సేవలు నిలిపివేయండి అని ఆదేశాలు తెచ్చారు. 
  • రాష్ట్ర ఎన్నికల అధికారులు వలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్‌ ఇవ్వొచ్చు అంటే...మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కుదరదని ఆదేశాలు ఇచ్చింది. 
  • ఎప్పుడైతే ఈ 66 లక్షల మంది పింఛన్‌దారులే కాకుండా, సామాన్య ప్రజానీకంలో తిరుగుబాటు వచ్చిందో అప్పుడు చంద్రబాబు మాటమారుస్తున్నాడు. 
  • వలంటీర్లు ఇస్తే తప్పేంటి..58 నెలలు ఇచ్చారు..ఈ రెండు మాసాలు ఇస్తేనే ప్రజలు మారిపోతారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. 

ప్రజలు కాలర్‌ పట్టుకునే సరికి.. 

  • ప్రజలు కాలర్‌ పట్టుకుని ప్రశ్నించే స్థితికి వచ్చేసరికి వలంటీర్లు అందరూ మంచోళ్లు అంటూ కొత్త రాగం అందుకున్నారు. 
  • వలంటీర్లు ఇంటింటికి పింఛన్‌ పంచాలి, వారు మంచోళ్లు వారిని కొనసాగిస్తాం, వారికి పదివేలు ఇస్తాం అంటూ మాట్లాడుతున్నారు. 
  • మీరు పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారని మీరనుకుంటున్నారా? 
  • జగన్‌ గారి సారధ్యంలో ఏర్పాటైన ఈ వ్యవస్థలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. 
  • సేవ చేయాలని వారు ఈ బాధ్యతలు తీసుకున్నారు కానీ జీతం, డబ్బులు కోసం కాదని చంద్రబాబు గుర్తించాలి. 

డబ్బుతో వలంటీర్లను కొనలేవు చంద్రబాబూ..!:

  • చంద్రబాబూ..నువ్వో, నీ దత్తపుత్రుడో డబ్బులకు అమ్ముడుపోతారేమో కానీ..వలంటీర్లు డబ్బులకు అమ్ముడు పోయేవారు కాదు. 
  • వలంటీర్లంటే నిస్వార్ధంగా పనిచేసే వారు. వారికి గాలం వేయడం నీ తరం కాదు. 
  • నీ నైజం వారికి తెలియంది కాదు. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలకు వలంటీర్లు అని పేరు తగిలిస్తావని వారికి తెలియంది కాదు. 
  • ఇప్పటికే మీ టీడీపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన మాకు సహకరించండి మీ వాళ్లకి వలంటీర్‌ ఉద్యోగం ఇస్తామని గాలం వేస్తున్నారు. 
  • జనం ఒకసారి, రెండు సార్లకు నమ్ముతారు కానీ..మాటిమాటికీ నమ్మరు చంద్రబాబూ..!
  • నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు. 
  • వలంటీర్లకు డబ్బు ఎర చూపితే నీకు లొంగే వాళ్లు కాదు. 
  • రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్‌ గారంటే ఏంటో తెలుసు. 
  • వచ్చేది జగన్‌ గారి ప్రభుత్వమే అనేదీ వారికి తెలుసు. ఆ ప్రభుత్వంలో వారి ఆలనా, పాలన ఎలా చూసుకుంటారో కూడా వారికి తెలుసు. 
  • నువ్వు కుట్రలు పన్నితే, ఎర వేస్తే డబ్బులుకు అమ్ముడుపోయే వారు కాదని చంద్రబాబు గుర్తెరగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement