
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటర్ వ్యవస్థపై చంద్రబాబు, ఈనాడు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
కాగా, ఎమ్మెల్యే కన్నబాబు శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయి. జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థను నిర్మూలించింది ఈ వ్యవస్థలే. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు చాలా చులకన చేసి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment