ఈ సైకోయిజాన్ని ఏమనాలి పసుపుపతి.. | Chandrababu Conspiracy Against Volunteers | Sakshi
Sakshi News home page

ఈ సైకోయిజాన్ని ఏమనాలి పసుపుపతి..

Published Thu, Apr 4 2024 7:16 PM | Last Updated on Fri, Apr 5 2024 5:46 PM

Chandrababu Conspiracy Against Volunteers - Sakshi

టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఎల్లో సమాధిలో కుళ్ళబెట్టిన.. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను వదల బొమ్మాళీ వదల అంటున్నావా లేదా పసుపుపతీ.. వాలంటీర్లపై కక్షతో నిమ్మగడ్డకు ఎల్లో ముసుగు తొడిగి కోర్టుల్లో కేసులు వేయించావా లేదా పసుపుపతీ.. జగన్‌ను ఎదుర్కోలేక పండుటాకులపై పగ పెంచుకున్నావా లేదా పసుపుపతీ.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందకుండా కుట్రలు కుతంత్రాలు చేశావా లేదా.. పసుపుపతీ. అవ్వాతాతలు ఎండలో మలమలా మాడుతుంటే.. పైశాచికానందం పొందుతున్నావా లేదా పసుపుపతీ.. వికలాంగులు నానా అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందుతున్నావా లేదా.. పసుపుపతీ.

చేసిందంతా చేసి నెపం జగన్ సర్కార్‌పై వేసేందుకు ఎల్లో తాతను వాడుకుంటున్నావా లేదా పసుపుపతీ... ఒక్కటి మాత్రం నిజం సిల్వర్ స్క్రీన్ పై అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లాగే ...పొలిటికల్ స్క్రీన్ పై అధికారంపై వ్యామోహంతో చంద్రబాబు పసుపుపతిలా మారిపోయారు. పైగా నేను అరుంధతి సినిమాలో పశుపతినే అని బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే... ఈ సైకోయిజాన్ని ఏమనాలి. అయ్యా పసుపుపతి గారూ...నీకు, నీఎల్లో ముఠాకు అవ్వాతాతల ఉసురు తగలడం గ్యారంటీ.. రామోజీ 87 ఏళ్ళ గుండెపై ఒట్టు.. అవ్వాతాతల కన్నీళ్ళు, వికలాంగుల కన్నీళ్ళు.. శాపమై మిమ్మల్ని వెంటాడటం గ్యారంటీ. చేసిందంతా చేసి పురాణాలు ప్రబోధిస్తున్న నువ్వు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటున్నారు.. అవ్వాతాతలు, విలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. 

1. జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక పండుటాకులపై పగ తీర్చుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 
2. అవ్వాతాతల పింఛన్లు ఆపేందుకు అడ్డదారిలో నిమ్మగడ్డను ఈసీ దగ్గరకు పంపావు.. ఇదేం సైకోయిజం బాబూ
3. పెన్షన్ల పంపిణీకి నువ్వే అడ్డంకులు సృష్టించి ఎల్లో మీడియాతో రివర్స్ ఎటాక్ చేయిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 
4. పండుటాకుల పింఛన్లపై కుట్రచేసి.. ఇప్పుడు నెపం ప్రభుత్వం పైకి నెట్టేసే ప్లాన్ వేశావు.. ఇదేం సైకోయిజం బాబూ
5. ఎండలో మలమలా మాడుతున్న వృద్ధుల్ని చూసి పైశాచికానందం పొందుతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 
6. సచివాలయాల దగ్గరకు నీ పచ్చమూకను పంపి పెన్షన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 
7. అవస్థలు పడుతున్న అవ్వాతాతలు తిరగబడతారని నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావు.. ఇదేం సైకోయిజం బాబూ
8. అచ్చెన్నాయుడితో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది నువ్వే అని చెప్పుకోలేకపోతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ
9. చేసిందంతా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపణీ చేయాలని ఉచిత సలహాలిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ
10. వాలంటీర్లపై నిమ్మగడ్డ, రామోజీలతో కుట్ర చేసి అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement