శరదృతువు వేకువ వేళల్లో చెట్లకు పట్టి ఉండే మంచు మాదిరిగా పైకి కనిపించకుండా, ఒక ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఈ రోజున మన రాష్ట్రమంతా ప్రజల్లో వ్యాపించి ఉంది. నాలుగు కారణాల వల్ల ఈ మాన సిక స్థితి (ఫీల్) మన సమాజం అంచులలోని (మార్జినలైజ్డ్) ప్రజల వరకు చేరుతూ, క్రమంగా ఒక భావనగా వారిలోకి లోతుగా ఇప్పటికే అది ఇంకింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది– ప్రతి యాభై కుటుంబాలకు అయాచి తంగా దొరికిన ‘గైడ్’ మాదిరిగా ‘కనెక్ట్’ అయిన ‘వాలెంటీర్లు’. రెండవది – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకంలో అందిన ఆర్థిక సహాయం. మూడవది – ‘స్మార్ట్ ఫోన్’ వినియోగం అన్ని ఆర్థిక వర్గాలకు చేరడం. చివరిది ‘సంక్షేమరాజ్యం’ భావన స్థిరపడడానికిగాను ప్రజల సమీ పానికి పరిపాలన చేరడానికి పాత 13 జిల్లాలు 26 కావడం.
మరి కొందరు దీన్ని – ‘విధ్వంసం’ అంటు న్నారు కదా అంటే, అదీ నిజమే. కాలం చెల్లిన పాతవాటిని పక్కకు నెట్టి, వాటి స్థానంలోకి వచ్చే ‘కొత్త’ ఏదైనా అలా అనిపించడం సహజమే. అయితే, కాలంలో వచ్చే మార్పులో భాగంగా వేగం కోసం ‘ఐ.టి.’ ద్వారా ‘స్మార్ట్ గవర్నెన్స్’ సాంకేతికతను పరిపాలనకు అన్వయించే మార్పు ప్రక్రియ గురించి, రేపటి తరం ఏమని అనుకుంటున్నది? అనేది ఇక్కడ ప్రధానం. భవిష్యత్తు యువతదే కనుక వర్తమానం సమీక్షకు వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు.
అయితే, నువ్వు ఏ కాలానికి అర్హమైన నాయ కుడివి? అనేది ఇక్కడ అతి విలువైన అంశం. ఈ ప్రభుత్వం వేటి కేంద్రితంగా ఉన్నదో చూడండి– ఒకటి ‘ప్రజలు’. రెండు ‘ప్రాంతము.’ చరిత్రలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పరిపాలించిన రాజులు విఫలం కాలేదు. ఈ రెండింటి కోసం నీకున్న ఐదేళ్ళ కాలపరిమితిలో నువ్వు ఏమి చేశావు? అనేది ప్రజల ముందుకు వెళ్లి వాళ్లకు చెబితే చాలు. నీ నిజాయతీని ప్రజలు గమనించి మిగిలింది కూడా నువ్వే పూర్తి చెయ్యి, అని మళ్ళీ నీకే కుర్చీ అప్పగిస్తారు. మన రాష్ట్రంలోని ఆలో చనాపరులకు మన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఇక్కడే అనుమానం కలుగుతున్నది.
గతంలో ‘జన్మభూమి’ నుంచి ‘విజన్– 2020’ వరకు ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కోసం మేధో కసరత్తు చేసిన అనుభవం పెట్టు కుని, ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ‘పబ్లిక్ పాల సీ’ని ప్రతిపక్షం తరఫున లేదా వారి కూటమి తరఫున గానీ ప్రకటించలేక పోవడం ఏమిటి? రాజకీయ విమర్శ కోసం సి.ఎం.ను– ‘సైకో’ అని, ప్రభుత్వ పరిపాలన ‘విధ్వంసం’ అని అన్న ప్పుడు, అ మాటలకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వరు? మీరు అంటున్న ‘విధ్వంసం’ నిజమై, అదే అనుభవం రాష్ట ప్రజలకు కూడాఉండి ఉంటే, అదేదో వివరం చెబితే ప్రజలు కూడా వాళ్ళూ మీతో ‘కనెక్ట్’ అవుతారు కదా? మీరు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు అస్పష్టంగా ఎందుకు ఉంటున్నాయి?
ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ విషయంలో ప్రతిపక్షం నిస్సహాయత చూశాక, ‘కూటమి’ని పక్కనపెట్టి – ‘కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి మారింది. ‘సాఫ్ట్‌వేర్’ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా’ కాలంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాకను ప్రోత్సహిస్తూ–‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్’ నినాదంతో ‘బి టైప్’ పట్టణాల్లో ‘టవర్ల’ సామర్థ్యం పెంచి, స్థానిక ఇంజనీరింగ్, పాలి టెక్నిక్ కాలేజీల్లో వీరి కోసం ‘వైఫై’ సేవలు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికొస్తే ఏమిటి పరిస్థితి? అనేదానికి వీరికి ఇదొక – ‘డ్రెస్ రిహా ర్సిల్స్’ అయింది.
అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారిన విద్య, వైద్యం, శాంతి భద్రతలు; ‘లీజర్’ కోసం రూపు మారుతున్న ‘పబ్లిక్ పార్కులు’, రెస్టారెంట్లు, అందుబాటులోకి వస్తున్న ‘క్యాబ్ సర్వీసులు’... ఇవన్నీ ఇక ముందు యువత మన రాష్ట్రంలో విస్తరిస్తున్న కంపెనీల్లో ఉపాధి వెతుక్కునే అంశాలు. ఇందులో వీరి అమ్మానాన్నల ‘పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉంటే బాగుండు’ అన్న ఆశను స్పర్శించే అంశం కలిసి ఉందనేది విడిగా చెప్పనక్కర లేదు.
ఈ అంశంపై వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పుడు ‘వాలంటీర్ల’ వివాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. దీన్ని ముగించేటప్పటికిరాష్ట్రంలో మారిన సామాజిక సన్నివేశం, పైన చెప్పిన ‘ఫీల్ గుడ్’ భావనను వాస్తవం చేసింది. కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి ఇప్పటికే మారింది. ఇక ముందు మన అనుభవంలోకి రానున్న రాష్ట్ర అభి వృద్ధి ప్రణాళికా రచనలో ఏమున్నదీ అ పార్టీ ఎన్ని కల ‘మ్యానిఫెస్టో’లో వెల్లడి కావలసి ఉంది.
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment