సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్‌స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి..
పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.
దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి
సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్‌్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం.
ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం
ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ స్టెప్.
విద్యతోనే విజయం
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment