State Growth rate
-
అట్టడుగు వర్గాలకు చేరిన కొత్త నమూనా
శరదృతువు వేకువ వేళల్లో చెట్లకు పట్టి ఉండే మంచు మాదిరిగా పైకి కనిపించకుండా, ఒక ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఈ రోజున మన రాష్ట్రమంతా ప్రజల్లో వ్యాపించి ఉంది. నాలుగు కారణాల వల్ల ఈ మాన సిక స్థితి (ఫీల్) మన సమాజం అంచులలోని (మార్జినలైజ్డ్) ప్రజల వరకు చేరుతూ, క్రమంగా ఒక భావనగా వారిలోకి లోతుగా ఇప్పటికే అది ఇంకింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది– ప్రతి యాభై కుటుంబాలకు అయాచి తంగా దొరికిన ‘గైడ్’ మాదిరిగా ‘కనెక్ట్’ అయిన ‘వాలెంటీర్లు’. రెండవది – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకంలో అందిన ఆర్థిక సహాయం. మూడవది – ‘స్మార్ట్ ఫోన్’ వినియోగం అన్ని ఆర్థిక వర్గాలకు చేరడం. చివరిది ‘సంక్షేమరాజ్యం’ భావన స్థిరపడడానికిగాను ప్రజల సమీ పానికి పరిపాలన చేరడానికి పాత 13 జిల్లాలు 26 కావడం. మరి కొందరు దీన్ని – ‘విధ్వంసం’ అంటు న్నారు కదా అంటే, అదీ నిజమే. కాలం చెల్లిన పాతవాటిని పక్కకు నెట్టి, వాటి స్థానంలోకి వచ్చే ‘కొత్త’ ఏదైనా అలా అనిపించడం సహజమే. అయితే, కాలంలో వచ్చే మార్పులో భాగంగా వేగం కోసం ‘ఐ.టి.’ ద్వారా ‘స్మార్ట్ గవర్నెన్స్’ సాంకేతికతను పరిపాలనకు అన్వయించే మార్పు ప్రక్రియ గురించి, రేపటి తరం ఏమని అనుకుంటున్నది? అనేది ఇక్కడ ప్రధానం. భవిష్యత్తు యువతదే కనుక వర్తమానం సమీక్షకు వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు. అయితే, నువ్వు ఏ కాలానికి అర్హమైన నాయ కుడివి? అనేది ఇక్కడ అతి విలువైన అంశం. ఈ ప్రభుత్వం వేటి కేంద్రితంగా ఉన్నదో చూడండి– ఒకటి ‘ప్రజలు’. రెండు ‘ప్రాంతము.’ చరిత్రలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పరిపాలించిన రాజులు విఫలం కాలేదు. ఈ రెండింటి కోసం నీకున్న ఐదేళ్ళ కాలపరిమితిలో నువ్వు ఏమి చేశావు? అనేది ప్రజల ముందుకు వెళ్లి వాళ్లకు చెబితే చాలు. నీ నిజాయతీని ప్రజలు గమనించి మిగిలింది కూడా నువ్వే పూర్తి చెయ్యి, అని మళ్ళీ నీకే కుర్చీ అప్పగిస్తారు. మన రాష్ట్రంలోని ఆలో చనాపరులకు మన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఇక్కడే అనుమానం కలుగుతున్నది. గతంలో ‘జన్మభూమి’ నుంచి ‘విజన్– 2020’ వరకు ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కోసం మేధో కసరత్తు చేసిన అనుభవం పెట్టు కుని, ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ‘పబ్లిక్ పాల సీ’ని ప్రతిపక్షం తరఫున లేదా వారి కూటమి తరఫున గానీ ప్రకటించలేక పోవడం ఏమిటి? రాజకీయ విమర్శ కోసం సి.ఎం.ను– ‘సైకో’ అని, ప్రభుత్వ పరిపాలన ‘విధ్వంసం’ అని అన్న ప్పుడు, అ మాటలకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వరు? మీరు అంటున్న ‘విధ్వంసం’ నిజమై, అదే అనుభవం రాష్ట ప్రజలకు కూడాఉండి ఉంటే, అదేదో వివరం చెబితే ప్రజలు కూడా వాళ్ళూ మీతో ‘కనెక్ట్’ అవుతారు కదా? మీరు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు అస్పష్టంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ విషయంలో ప్రతిపక్షం నిస్సహాయత చూశాక, ‘కూటమి’ని పక్కనపెట్టి – ‘కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి మారింది. ‘సాఫ్ట్వేర్’ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా’ కాలంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాకను ప్రోత్సహిస్తూ–‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్’ నినాదంతో ‘బి టైప్’ పట్టణాల్లో ‘టవర్ల’ సామర్థ్యం పెంచి, స్థానిక ఇంజనీరింగ్, పాలి టెక్నిక్ కాలేజీల్లో వీరి కోసం ‘వైఫై’ సేవలు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికొస్తే ఏమిటి పరిస్థితి? అనేదానికి వీరికి ఇదొక – ‘డ్రెస్ రిహా ర్సిల్స్’ అయింది. అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారిన విద్య, వైద్యం, శాంతి భద్రతలు; ‘లీజర్’ కోసం రూపు మారుతున్న ‘పబ్లిక్ పార్కులు’, రెస్టారెంట్లు, అందుబాటులోకి వస్తున్న ‘క్యాబ్ సర్వీసులు’... ఇవన్నీ ఇక ముందు యువత మన రాష్ట్రంలో విస్తరిస్తున్న కంపెనీల్లో ఉపాధి వెతుక్కునే అంశాలు. ఇందులో వీరి అమ్మానాన్నల ‘పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉంటే బాగుండు’ అన్న ఆశను స్పర్శించే అంశం కలిసి ఉందనేది విడిగా చెప్పనక్కర లేదు. ఈ అంశంపై వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పుడు ‘వాలంటీర్ల’ వివాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. దీన్ని ముగించేటప్పటికిరాష్ట్రంలో మారిన సామాజిక సన్నివేశం, పైన చెప్పిన ‘ఫీల్ గుడ్’ భావనను వాస్తవం చేసింది. కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి ఇప్పటికే మారింది. ఇక ముందు మన అనుభవంలోకి రానున్న రాష్ట్ర అభి వృద్ధి ప్రణాళికా రచనలో ఏమున్నదీ అ పార్టీ ఎన్ని కల ‘మ్యానిఫెస్టో’లో వెల్లడి కావలసి ఉంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి...
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యంతో ప్రపంచ, జాతీయ వృద్ధి రేటు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వృద్ధి రేటు చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.4 శాతానికి పతనమైందని, ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యల్పమని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అవకాశాల నివేదిక పేర్కొంటోంది. 2019–20లో జాతీయ వృద్ధిరేటు సైతం 5 శాతానికి పడిపోనుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కానుందని అంచనా. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు గణాంకాలతో పోలిస్తే ఈసారి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. అయినా జాతీయ వృద్ధిరేటు సగటును మించిన వృద్ధి రేటును రాష్ట్రం సాధించనుంది. ఇలా అధిగమించడం 2015–16 నుంచి ఇది వరుసగా ఐదోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.8.61 లక్షల కోట్లతో 14.3 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, 2019–20 నాటికి రూ.9.7 లక్షల కోట్లకు పెరిగి 12.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. 2018–19లో స్థిర ధరల వద్ద 6.13 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2019–20లో 8.2 శాతం వృద్ధి రేటుతో రూ.6.63 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా. ప్రథమ, తృతీయ రంగాల హవా.. రంగాల వారీగా పరిశీలిస్తే.. 15.8 శాతం వృద్ధి రేటుతో ప్రాథమిక, 14.1 శాతం వృద్ధి రేటుతో తృతీయ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడుతున్నాయి. ద్వితీయ రంగం 5.3 శాతం వృద్ధి రేటును సాధించింది. ప్రాథమిక రంగం పరిధిలోని వ్యవసాయం, పశు, అటవీ, మత్స్య పరిశ్రమలు, మైనింగ్, క్వారీయింగ్, ద్వితీయ రంగం పరిధిలో తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర పౌరసేవలు, నిర్మాణ రంగ పరిశ్రమలు, తృతీయ రంగం పరిధిలో వాణిజ్య, రిపేర్ సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, స్టోరేజీ, ప్రసార సేవలు, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, నివాస గృహాల యాజమాన్య హక్కులు, వృత్తి సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు వస్తాయి. మొత్తానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 65.2 శాతం చేయూత (గ్రాస్ వాల్యూ యాడెడ్/ జీవీఏ) తృతీయ రంగమే అందిస్తోంది. జాతీయ సగటు కన్నా అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నిలబెట్టుకుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయ తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 6.3 శాతం కాగా, రాష్ట్రం 11.6 శాతాన్ని సాధించింది. చివరగా, జాతీయ స్థాయిలో 8.08 ద్రవ్యోల్బణం నమోదు కాగా, రాష్ట్రంలో సైతం 7.46 నమోదైంది. పారిశ్రామిక కార్మికుల కోసం రూపొంచిన వినియోగదారుడి ధరల సూచిక (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. చర్యలు సఫలీకృతం.. వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ సగటుకు మించిన వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. 32 అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ధి తెలంగాణకు హరితహారంలో భాగంగా 2019లో మొత్తం 38.18 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 31.79 కోట్ల మేర జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, ఇతర జిల్లాల్లో కలిపి 32 అర్బన్ ఫారెస్ట్ పార్కులు పూర్తి చేశారు. మరో 46 ప్రాంతాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణలోని వివిధ అడవుల పరిధిలోని జీవవైవిధ్యం కాపాడేందుకు 12 రక్షిత ప్రాంతాల పరిధిలోని 9 వన్యప్రాణి అభయారణ్యాలను, 3 జాతీయపార్కులను (జాతీయపార్కుల వరకు 5,692.48 చదరపు కి.మీ) నెట్‌వర్క్‌ను ప్రకటించింది. తెలంగాణలో 2,939 చెట్ల రకాలు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాలు, 28 రకాల సరీసృపాలున్నాయి. రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969.48 లక్షల చ.కి.మీ.గా విస్తరించి ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడో వంతు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోఉండగా, నాలుగు జిల్లాల్లో అంటే ఈ రెండు జిల్లాలతో సహా నాగర్‌కర్నూల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 50 శాతం అటవీ ప్రాంతముంది. మొత్తం కలిపి రాష్ట్రంలోని అటవీప్రాంతమున్న 24 శాతం అటవీ శాఖ నిర్వహణ పరిధిలో ఉన్నా దాదాపు 15 శాతంలో మాత్రమే గణనీయమైన పచ్చదనం, అడవులున్నాయి. 2020–21 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో 68 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1994 నుంచే అటవీ శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ల సాంకేతికను వినియోగిస్తోంది. రిమోట్ సెన్సింట్ శాటిలైట్ ఇమేజరీ సాంకేతికను ఉపయోగించి అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఎకో టూరిజంలో భాగంగా బొగతా, కుంతాల, పొథెరా, మల్లెలతీర్థం జలపాతాలు, అనంతగిరి హిల్స్, మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం చెరువు, మల్లారం ఫారెస్ట్, పాకాల చెరువు, టైగర్ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తోంది. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. -
వృద్ధి రేటు ‘పది’లమే
కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడటానికి కోర్టుల్లో చేసిన న్యాయ పోరాటాలు ఫలిస్తున్నాయి. రూ. వేల కోట్ల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగింది. ఈ భూములను విక్రయించడం వల్ల ఆదాయం సమకూరుతుంది. దాన్ని ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటు పదిలంగానే ఉంది. ఏడాదిన్నరగా దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా, రెండంకెల వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టు కుంది. వరుసగా ఐదో ఏడాది జాతీయ సగటును అధిగ మించింది. మాంద్యం ప్రభావంతో 2018–19 ఆర్థిక ఏడాదిలో జాతీయ వృద్ధి రేటు 6.8 శాతానికి పతనం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 10.5 శాతానికి ఎగ బాకింది. రాష్ట్రంలో పశు సంపద, మైనింగ్, తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విద్య, వైద్యం తదితర రంగాలు ఏటేటా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడు తున్నాయి. 2017–18లో స్థిర ధరల వద్ద 5.6 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2018–19లో 10.5% వృద్ధి రేటుతో రూ. 6.19 లక్షల కోట్లకు పెరిగింది. 2017–18లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.7.54 లక్షల కోట్లు కాగా, 2018–19లో 14.8 శాతం వృద్ధిరేటుతో రూ.8.66 లక్షల కోట్లకు పెరిగినట్లు సీఎం తెలిపారు. -
వృద్ధి రేటు 11.72 శాతం: సీఎం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచిందన్నారు. అత్యధిక తలసరి ఆదాయం హర్యానాలో ఉందన్నారు. కేవలం నిధులు వెచ్చించగానే వృద్ధి చెందుతామని అనుకోవడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యదర్శులు, శాఖాధిపతుల సదస్సుల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ శాఖ అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. తొలి త్రైమాసికంలో సాధించిన 11.72 శాతం వృద్ధిలో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదే కావటంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణపై మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఫిషరీస్ కమిషనర్ శంకర్ నాయక్‌తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను సీఎం గుర్తు చేశారు. సీఎస్‌కూ బయోమెట్రిక్ హాజరు పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు తనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదును తప్పనిసరి చేస్తున్నట్లు సీఎం చెప్పారు. -
కరువున్నా వృద్ధి రేటు 11.61%
-
కరువున్నా వృద్ధి రేటు 11.61%
⇒ దేశ వృద్ధిరేటు 7.11 శాతమే ⇒ ఆర్థిక ఫలితాలపై సంతృప్తిగా ఉన్నా: సీఎం సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరంలో కరువు నెలకొన్నా రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని కొనసాగించామని సీఎం చంద్రబాబుచెప్పారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో రాష్ట్రం 11.61 శాతం వృద్ధిరేటు సాధించిందని, దేశ వృద్ధిరేటు మాత్రం 7.11 శాతమే ఉందని తెలిపారు. వ్యవసాయం–వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వృద్ధిరేటు 14.03 శాతం ఉండగా, దేశంలో 4.37 శాతం ఉందన్నారు. పరిశ్రమల రంగంలో 10.05 శాతం, సేవల రంగంలో 10.16 శాతం వృద్ధి నమోదు చేయగా, ఇదే సమయంలో దేశ వృద్ధి 5.77 శాతం, 7.87 శాతం ఉన్నాయని వివరించారు. వీటిపై తాను సంతృప్తిగా ఉన్నానన్నారు. ఈ ఉత్సాహంతో 2017–18లో 15 శాతం వృద్ధి నమోదు చేద్దామని అధికారులను కోరారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బాబు మాట్లాడారు. సేవలరంగ వృద్ధి కోసం త్వరలో కార్యదర్శులతో అధ్యయన కమిటీ నియమిస్తామని తెలిపారు.పరిపాలనా సంస్కరణలపైనా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర పథకాలు, కేంద్ర నిధులు ఖర్చు చేయడంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 నమోదు చేస్తే, దేశ తలసరి ఆదాయం రూ.1,03,818 మాత్రమే ఉందని చెప్పారు. దేశం కన్నా రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.18,558 ఎక్కువగా ఉందన్నారు.